ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు, కానీ 3 సెం.మీ. కదిలింది
బీజింగ్: నేపాల్‌లో భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు పర్వతం ఎత్తు ప్రభావితమైందన్న నివేదికలతో చైనా అధికారిక పర్యవేక్షక సంస్థ విభేదించింది. ఎవరెస్టు పర్వతం మూడు సెంటీమీటర్లు కదిలిందని, ఎత్తు ఏమాత్రం తగ్గలేదని చైనా జాతీయ భూపరిజ్ఢాన సమాచారం, పర్యవేక్షణ పరిపాలన సంస్థ వెల్లడించింది.
పదేళ్లుగా ఈ పర్వంత ఈశాన్య దిశగా 40 సెంటీమీటర్లు కదిలినట్లు తెలిపింది. భూకంప లేఖిని పైన 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు ఈ పర్వతం 2.5 సెంటీమీటర్లు కుంగిందని ఐరాపాకు చెందిన సెంటినెల్ 1 ఏ రాడర్ ఉపగ్రహ నివేదికలు వెల్లడించాయి.

దీనితో చైనా విభేదించింది. నేపాల్‌లో ఏప్రిల్ 25 నుండి మే 12వ తేదీ వరకు పలుమార్లు భూమి కంపించింది. ఇటీవల కూడా ఓసారి కంపించింది. వీటి వల్ల ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదని చైనా సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848 మీటర్లు.












Click it and Unblock the Notifications