అసిమ్ మునీర్ కు 'థానోస్' పవర్స్..? చిటికేస్తే ఇక అంతేనా..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. పాకిస్థాన్ కు చెందిన జెట్స్ ను కూల్చేసింది. ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పలు సంస్థాగత మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు మరిన్ని పవర్స్ ను కట్టబెట్టేందుకు పూనుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ మిలిటరీలో ఓ కొత్త పోస్టును ఏర్పాటు చేయనుంది. ది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పోస్టును ఏర్పాటు చేసి ఆ పగ్గాలను అసిమ్ మునీర్ కు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.
ఆపరేషన్ సింధూర్ అనంతరం సైన్యంలో మార్పులను చేపడుతోంది పాకిస్థాన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లను ఒకే థాటిపైకి తెచ్చి ది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పోస్టును ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ను సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ఇదే విషయాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) ఛైర్మన్ బిలావల్ భుట్టో- జర్దారీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ సవరణ విషయంపై రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కలిసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఆర్టికల్ 243ను సవరించడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిమ్ మునీర్ పదవిని మరింత సంరక్షించేందుకు.. ది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పోస్టును కూడా ఆయనకే కట్టబెట్టనున్నారు. దీంతో ఆయనకున్న ఆర్మీ పవర్స్ మరింత శక్తివంతంగా మారనున్నాయి. పాక్ ప్రభుత్వానికి అధికారాలు తగ్గి సైన్యానికి మరింత అధికారం రానుంది. భారత్ లో మాదిరిగానే త్రి దళాలను ఏకం చేసి వాటికి ఒకర్ని హెడ్ గా పెట్టేందుకు పాకిస్థాన్ నిర్ణయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పోస్టు నిర్ణయానికి పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి ఖవాజా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నవంబర్ 28న అసిమ్ మునీర్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన్ను కొనసాగించడానికే కొత్త పదవి తీసుకొస్తున్నట్లు పాక్ లోని విపక్షాలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications