ఇండియాలో తాలిబన్ అలజడి: ముస్లిం లాబోర్డు నోమాని మద్దతు -అఫ్గాన్‌పై మోదీ వ్యూహం ఇదేనా?

పొరుగు దేశం అఫ్గానిస్థాన్ లో తాలిబన్ రాజ్యం ఏర్పడిన తర్వాత భారత్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించినా లేకపోయినా వారితో భారత్ కచ్చితంగా చర్చలు జరపాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ప్రధాని దేవేగౌడ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఇప్పటికే ఈ విషయమై బాహాటంగా మాట్లాడటమే కాదు, అఫ్గానిస్థాన్ పై మోదీ సర్కారు విధానమేంటో వెల్లడించాలనీ డిమాండ్ చేశారు. ఇది చాలదన్నట్లు కీలక సంస్థలు, పాపులర్ పార్టీలకు చెందిన ముస్లిం నేతలు ఇప్పుడు తాలిబన జపాన్ని తలకెత్తుకున్నారు..

తాలిబన్లకు సెల్యూట్..

తాలిబన్లకు సెల్యూట్..


'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్థాన్' కాస్తా తాలిబన్ల ఆక్రమణతో 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'గా మారిపోయింది. తాము ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు, మద్దతు లభించేలా తాలిబన్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హింసను అనుభవించినవారు కావడంతో సొంత దేశస్తులెవరూ తాలిబన్లను నమ్మకపోవడం, శాంతి వచనాలు వల్లె వేస్తూనే జనం ప్రాణాలు తోడేస్తున్న తీరు, అష్రఫ్ ఘని గైర్హాజరీలో దేశానికి తానే అధ్యక్షుడినని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ప్రకటించుకోవడం తదితర పరిణామాలు అఫ్గాన్ అశాంతిని మరింత పెంచుతున్నాయి. మరో అంతర్యుద్ధం తప్పదనే అంచనాలకుతోడు, తాలిబన్ సేనలు కాబూల్ సిటీలో పలు చోట్ విరివిగా కాల్పులకు పాల్పడుతుండటంతో భయాందోళనలను పెరిగాయి. సరిగ్గా ఈ దశలో, తాలిబన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ భారతీయ ముస్లిం ప్రముఖుడు ప్రకటన చేయడం కలకలం రేపింది..

ఇండియన్ ముస్లింల తరఫున..

ఇండియన్ ముస్లింల తరఫున..

అఫ్గాన్ పై విధానాలు మార్చుకోవాలని మోదీని ఒత్తిడి చేస్తోన్న రాజకీయ నేతల్లో ఎవరు కూడా తాలిబన్ ఆక్రమణను సమర్థించలేదు. అయితే ముస్లిం కమ్యూనిటీకి చెందిన కీలక నేతలు మాత్రం తాలిబన్లను ఆకాశానికెత్తేస్తున్నారు. అఫ్గాన్ ను తాలిబాన్‌ ఆక్రమించుకోవడం వంద శాతం సబబే అని, వారి పోరాటం న్యాయసమ్మతమైనదే అని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) అధికార ప్రతినిధి సజ్జాద్ నోమాని అన్నారు. భారత్‌లోని ముస్లింల అందరి తరఫున తాలిబన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ నోమాని చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. అంతేకాదు,

తాలిబన్ల గెలుపు మామూలు విషం కాదు..

తాలిబన్ల గెలుపు మామూలు విషం కాదు..

''ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తుల(అమెరికా)ను తాలిబన్లు మట్టికరిపించారు. మాతృదేశం అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తిరిగి కైవసం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పైగా ఆయుధాలు వాడకుండానే(పేల్చకుండానే) బలమైన శక్తులు(అమెరికా)ను తాలిబన్లు ఓడించగలగడం మామూలు విషయం కాదు. భారత ముస్లింలు అందరి తరఫున వాళ్ల పోరాటానికి నా సెల్యూట్'' అని సజ్జాద్ నోమాని అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుకు అధికార ప్రతినిధిగా కొనసాగుతూ నోమాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం బోర్డుదా లేదా వ్యక్తిగతమైందా అనే క్లారిటీ రావాల్సి ఉంది. సజ్జాద్ కంటే ముందు..

అఫ్గాన్‌తో నాకేం పని? ఎస్పీ ఎంపీ యూటర్న్

అఫ్గాన్‌తో నాకేం పని? ఎస్పీ ఎంపీ యూటర్న్


తాలిబన్లను వేనోళ్లా పొడుగుతూ ఇండియన్ ముస్లిం లా బోర్డు ప్రతినధి సజ్జాద్ నోమాని మాట్లాడటం కంటే ముందు, ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకర్ రహమాన్ బర్క్ సైతం అదే పని చేసి చిక్కుల్లో పడ్డారు. తాలిబ‌న్ల‌ పోరాటం భారత స్వాతంత్ర్య పోరాటం కంటే ఏమాత్రం తక్కువ కాదని, బ్రిటిషర్ల చెర నుంచి భారత్ విముక్తి అయినట్లే, ఇవాళ అమెరికా కబంద హస్తాల నుంచి అఫ్గాన్ విడుదలైందని ఎంపీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న యోగి సర్కారు.. ఎంపీ షపీకర్ పై దేశ ద్రోహం కేసు పెట్టింది. దీంతో ఎంపీ యూటర్న్ తీసుకోక తప్పలేదు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ''నేను భారత స్వాతంత్ర్య పోరాటాన్ని తాలిబన్ ఆక్రమణతో పోల్చలేదు. నా మాటలను మీడియానే వక్రీకరించింది. నేను భారతీయ పౌరుణ్ని. అఫ్గాన్ కు చెందిన వ్యక్తిని కాను. నేను ఇక్కడి(నా) ప్రభుత్వ విధానాలనే సమర్థిస్తాను. అసలు అఫ్గాన్ లో ఏం జరిగితే నాకెందుకు?'' అని ఎంపీ షఫీకర్ వివరణ ఇచ్చారు.

మోదీనే నమ్ముకున్నామన్న అఫ్గాన్లు..

మోదీనే నమ్ముకున్నామన్న అఫ్గాన్లు..

ఓవైపు తాలిబన్లతో చర్చలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే, అదే తాలిబన్లను పొడిగినందుకు ఎంపీపైనే దేశ ద్రోహం పెట్టిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. విచ్చల విడిగా దేశ ద్రోహం కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఇదివరకే అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఎంపీ షఫీకర్ పై కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే, అఫ్గాన్ తిరిగి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్ల‌డంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అఫ్గాన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఉంటోన్న అఫ్గాన్లు సైతం ఏది ఏమైనా తాము తిరిగి స్వ‌దేశానికి వెళ్ల‌బోమ‌ని, ఇక్కడే ఉంటామ‌ని చెబుతున్నారు. ఎంతోకాలంగా అఫ్గాన్ కు మిత్రదేశంగా ఉంటోన్న ఇండియానే తమను కాపాడాలని, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సముచిత నిర్ణయం తీసుకుంటాని నమ్ముతున్నట్లు కోల్ కతాలో నివసిస్తోన్న అఫ్గాన్లు మీడియాతో అన్నారు. అఫ్గాన్ పరిస్థితిపై మంగళవారం రాత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. ముందుగా భారతీయుల తరలింపు, శరణార్థులకు సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అఫ్గాన్ లో తాలిబన్ రాజ్యం వల్ల ఐసిస్, జైషే, లష్కరే లాంటి ఉగ్ర సంస్థలు మరింత బలపడే అవకాశాలుండటం, అవి అతి త్వరలోనే భారత్ పై దాడులు చేయొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో మోదీ సర్కారు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారింది. ప్రస్తుతానికైతే అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని భారత్ గుర్తించడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+