అక్కడ ఉండటం సేఫ్ కాదు: చీకటి పడకముందే ఖాళీ: ఆ మూడు నగరాలకు: భారత విద్యార్థులకు ఆర్డర్స్
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేశాయి రష్యా సైనిక బలగాలు. రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోన్నాయి. సుమీ, ఖార్‌కీవ్ నగరాల్లో పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. ఖార్‌కీవ్‌ను సొంతం చేసుకున్నట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. రష్యన్ సైనిక బలగాలను ఉక్రెయిన్ తిప్పికొడుతోండటంతో- ఖార్‌కీవ్ రణరంగంగా మారింది.
Recommended Video
ఉక్రెయిన్ సైనిక బలగాలు ప్రతిఘటిస్తోన్న కొద్దీ- రష్యా మరింత రెచ్చిపోతోంది. యుద్ధ తీవ్రతను రెట్టింపు చేస్తోంది. రాకెట్లను సంధిస్తోంది. మిస్సైళ్లను ప్రయోగిస్తోంది. కీవ్‌లోని భారీ భవంతులు, ప్రభుత్వ కార్యాలయాలపై రాకెట్లను సంధిస్తోన్నాయి. మిలటరీ అకాడమీ, ఆసుపత్రి ధ్వంసం అయ్యాయి. మంటల బారిన పడ్డాయి. ఈ దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ సైనికులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నాయి.

ఈ పరిణామాలతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. కీవ్‌ను ఖాళీ చేసిన వెళ్లిన భారత రాయబారులు- ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని ల్వీవ్ సిటీకి చేరుకున్నారు. అక్కడి నుంచి తమ కార్యకలాపాలను పునఃప్రారంభించారు. ఖార్‌కీవ్‌లో చోటు చేసుకుంటోన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారు. రణరంగంగా మారిన ఈ నగరంలో తలదాచుకోవడం ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6 గంటల్లోగా ఖార్‌కీవ్‌ను వదిలి వెళ్లాలని సూచించారు. పిసోచిన్, బెజ్లియుడోవ్‌కా, బబయె నగరాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలని ఆదేశించారు. ఖార్‌కీవ్‌లో ఉండే కొద్దీ పరిస్థితులు విషమించినట్టే అవుతుందని హెచ్చరించారు. రష్యా సైనిక బలగాలు తమ దాడులు మరింత తీవ్రతరం చేయడానికి ఖార్‌కీవ్‌ను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ అక్కడ ల్యాండ్ అయిందని వివరించారు.
ఖార్‌కీవ్‌లో సంభవించిన దాడుల సందర్భంగానే కర్ణాటక హవేరి జిల్లా చాలగెరికి చెందిన నవీన్ శేఖరప్ప అనే వైద్య విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. అక్కడే ఉంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మరిన్ని చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన భారత రాయబార కార్యాలయం అధికారుల్లో నెలకొని ఉంది. సాయంత్రం 6 గంటలకు ముందే ఖార్‌కీవ్‌ను వదిలేసి పిసోచిన్, బెజ్లియుడోవ్‌కా, బబయె నగరాలకు చేరుకోవాలని ఆదేశించారు.
URGENT ADVISORY TO INDIAN STUDENTS IN KHARKIV.@MEAIndia @PIB_India @DDNational @DDNewslive pic.twitter.com/2dykst5LDB
— India in Ukraine (@IndiainUkraine) March 2, 2022












Click it and Unblock the Notifications