కుప్పకూలిన మిలిటరీ విమానం: బౌద్ధ గురువుతోపాటు 12 మంది మృతి
నైపీడా: మయన్మార్ దేశంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రముఖ బౌద్ధ గురువుతోపాటు 12 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటన మయన్మార్‌లోని మండాలయ ప్రాంతంలో చోటు చేసుకుంది. నైపీడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Recommended Video
గురువారం దేశ రాజదాని నైపీడా నుంచి ఓ ఎల్విన్ పట్టణానికి ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు బౌద్ధ గురువుతోపాటు 14 మంది మిలిటరీ విమానంలో బయల్దేరారు. విమానంలో ఆరుగురు మిలిటరీ సిబ్బందితోపాటు ఇద్దరు బౌద్ధమత గురువులు, ఆరుగురు భక్తులు ఉన్నారు.

400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సీనియర్ బౌద్ధ గురువుతోపాటు 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ సైనికుడితోపాటు మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక పాలన నడుస్తున్న విషయం తెలిసిందే.
కాగా, 2016 ఫిబ్రవరిలో నైపీడా నుంచి గాలిలోకి ఎగిరిన కాసేపటికే ఎయిర్ ఫోర్స్ బీచ్ క్రాఫ్ట్ 1900డీ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.












Click it and Unblock the Notifications