అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ మిమానం
దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
యాంగాన్: దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
మైయిక్, యాంగాన్ ప్రాంతాల మధ్యలో ఈ విమానం కన్పించకుండా పోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ , యాంగాన్ విమానాశ్రయశాఖాధికారులు దృవీకరించారు.

దవాయ్ పట్టనానికి పశ్చిమాన 20 మైళ్ళ దూరంలో ఉన్న సమయంలో విమానానికి, రాడార్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు ఆర్మీ కమాండర్ తెలిపారు. విమానంలో మొత్తం 105 మంది ఉన్నారు. మరో 11 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదంలో అందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications