వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్లకు మిస్టరీ రోబోకాల్స్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర కలకలం.. రంగంలోకి ఎఫ్‌బీఐ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు(నవంబర్ 3) మిస్టరీ రోబోకాల్స్ కలకలం రేపాయి. ఓటర్ల నుంచి దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రంగంలోకి దిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నియంత్రించేందుకు ప్రయోగించిన ఈ 'మిస్టరీ రోబోకాల్స్' ఎవరి పనై ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. ఎలక్ష డే రోజు చాలామంది ఓటర్లకు వచ్చిన ఈ ఫోన్ కాల్‌లో... 'స్టే సేఫ్ అండ్ స్టే హోమ్(భద్రంగా ఉండండి,ఇంటి వద్దే ఉండండి)' అని పేర్కొనడం గమనార్హం.

డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం: భారత జ్యోతిష్కుడి మాట ఇదేడొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం: భారత జ్యోతిష్కుడి మాట ఇదే

ముందే పసిగట్టిన హోంల్యాండ్ సెక్యూరిటీ...

ముందే పసిగట్టిన హోంల్యాండ్ సెక్యూరిటీ...

నిజానికి ఎన్నికల రోజున ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ముందే పసిగట్టారు. అందుకే మంగళవారం(నవంబర్ 3) అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కి కాస్త ముందు ప్రెస్ మీట్ ద్వారా పలు విషయాలు వెల్లడించారు. 'ఈరోజు పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు లేదా చర్యలు ఏవైనా చోటు చేసుకోవచ్చు. ఎన్నికలపై విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి ఓటర్లు వాటికి ప్రభావితం కాకుండా స్వేచ్చగా ఓటింగ్‌లో పాల్గొనాలి.' అని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పిలుపునిచ్చారు.

విచారణ చేపడుతామన్న న్యూయార్క్ అటార్నీ..

విచారణ చేపడుతామన్న న్యూయార్క్ అటార్నీ..


మిస్టరీ రోబోకాల్స్‌ ఫిర్యాదులపై స్పందించిన న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్... ఈ వ్యవహారంపై విచారణ చేపడుతామని చెప్పారు. ఓటింగ్ అమెరికా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని... ఓటింగ్‌లో పాల్గొనకుండా ఓటర్లను అడ్డుకునే చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆ మిస్టరీ రోబోకాల్స్‌ అక్రమమని... వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఓటర్లు ఇలాంటివాటికి ప్రభావితం కాకుండా తప్పనిసరిగా తమ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అమెరికా ఎన్నికలు ఎప్పుడూ పారదర్శకంగా,స్వేచ్చాయుత వాతావరణంలో జరుగుతాయన్నారు.

రంగంలోకి ఎఫ్‌బీఐ..

రంగంలోకి ఎఫ్‌బీఐ..

అటు ఎఫ్‌బీఐ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. అయితే దీనిపై విచారణ జరుపుతున్నారా లేదా అన్నది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. అయితే హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ సీనియర్ అధికారి మాత్రం... మిస్టరీ రోబోకాల్స్‌పై ఎఫ్‌బీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించిందన్నారు. గత 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా మెయిల్స్ జోక్యం కలకలం రేపిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు రష్యా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలున్నాయి. తాజాగా రోబోకాల్స్ వ్యవహారం తెరపైకి రావడంతో దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.

విదేశీ శక్తుల హస్తం...?

విదేశీ శక్తుల హస్తం...?


అమెరికాపై ఉన్న పగతో ఇరాన్ కూడా ఈసారి అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గతంలో కొన్ని మెయిల్స్ కలకలం రేపాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయకపోతే మీ అంతు చూస్తామంటూ కొంతమంది అమెరికన్లకు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్‌ను పరిశీలించిన అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు... ఎన్నికల్లో ట్రంప్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్నికల రోజే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయోగించిన రోబోకాల్స్ వెనుక కూడా విదేశీ శక్తుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Voters in several US states have received mysterious robocalls urging them to stay home on Election Day, according to state and party officials.But midday Eastern time - with more than half the expected number of American ballots already cast - there was little sign of digital interference long dreaded by those charged with keeping the vote safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X