• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సై అంటే సై: అంకుల్ శ్యామ్‌తో ఢీకొట్టేందుకు ఉన్ రెడీ

  By Swetha Basvababu
  |

  పాంగ్యాంగ్: అంతర్జాతీయ వాదమైన కమ్యూనిజంలోనుంచి అనువంశిక పాలన రావడం ఓ వైచిత్రి. ఉత్తరకొరియాలో కిమ్‌ఇల్ సంగ్ హయాంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. కిమ్ ఇల్ సంగ్ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ దేశాధ్యక్ష పదవి చేపట్టారు. తర్వాత క్రమంలో ప్రస్తుతం ఒకనాటి కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్ సంగ్ మనుమడు ఆయనకు మూడోతరం వారసుడు రాజ్యమేలుతున్నారు.

  అతని పేరే కిమ్ జోంగ్ ఉన్. ఆ బుడ్డోడే ఇప్పుడు అనుదినం అణుప్రయోగాలతో ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్నారు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పెద్దన్న (అమెరికా)కు తానే సమఉజ్జీనంటున్నారు. ఈ చిచ్చరపిడుగుకు రాజకీయ అనుభవంలేకున్నా 2011లో 30వ యేట తండ్రి కిమ్‌జోంగ్ ఇల్ మరణంతో ఉత్తరకొరియాకు ఉత్తరాధికారి అయ్యారు. ఉత్తరకొరియా ఒంటికొమ్ము సొంటికాయ దేశం. ప్రపంచం నుంచి ముఖం తిప్పేసుకుని తనదైన లోకంలో విహరిస్తున్నది. కానీ సైనికబలంలో మాత్రం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మిలిటరీ ఉన్నది. పైగా అణ్వస్త్ర రాజ్యం. ఎవరి మీద గురి అంటే అగ్రరాజ్యం అమెరికా అని చెబుతూ ఉంటుంది.

  ఇలా అంచెలంచెలుగా ప్రమోషన్లు

  ఇలా అంచెలంచెలుగా ప్రమోషన్లు

  ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌కు బాస్కెట్‌బాల్ అంటే పిచ్చి. బాస్కెట్‌బాల్ క్రీడలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మైకేల్ జోర్డాన్ అంటే వల్లమాలిన అభిమానం. స్విట్జర్లాండ్‌లోని స్కూలు హాస్టల్ గదినిండా జోర్డాన్ పోస్టర్లే. ఉన్‌లో పోటీతత్వమూ ఎక్కువే. బొద్దుగా ఉండి ఐదడుగులు ఆరంగుళాల ఎత్తు మాత్రమే ఉండే ఉన్ బాస్కెట్‌బాల్ బాగానే ఆడేవాడని క్లాస్‌మేట్ నికొలా కొవాచెవిక్ చెప్పాడు. తానే గెలవాలని మొండి పట్టుదల ఉన్‌లో ఎక్కువని కూడా తెలిపారు. ‘ఓటమి ఉన్‌కు ఇష్టం ఉండదు. గెలుపే అతనికి ముఖ్యం' అని నికొలా అన్నాడు. పాశ్చాత్య పాప్ సంగీతం అంటే కూడా ఉన్‌కు మక్కువే. విట్నీ హ్యూస్టన్, మైకేల్ జాక్సన్ అంటే చెవికోసుకునేవాడని క్లాస్‌మేట్స్ చెప్పారు. కాగా, విద్యాభ్యాసం తర్వాత ఉన్ అన్నతో కలిసి కిమ్‌ఇల్ సంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు. 2007లో తండ్రితో కలిసి ఇద్దరూ క్షేత్ర పర్యటనలకు వెళ్లేవారు. తండ్రి కిమ్‌జోంగ్ ఇల్ మరణశయ్యపై ఉన్నప్పుడు ఉన్‌కు పెద్దగా అనుభవం లేకున్నా, రాజకీయ, సైనిక పదవుల్లో వెంటవెంటనే ప్రమోషన్లిచ్చి అగ్రాసనానికి చేరువ చేశారు. ఉత్తరకొరియన్లు ఈ కిమ్ వంశాంకురాన్ని మహానేత కిమ్‌ఇల్ సంగ్‌కు యువ అవతారమని భావిస్తారు. ఆకారంలో తాతకు దగ్గరగా ఉంటాడని అంటారు. ఆ పోలిక కోసం ఉన్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని చెప్తారు. కానీ ఇదంతా గిట్టని మీడియా ప్రచారమని ఉన్ అనుచరులు కొట్టిపారేస్తారు. ఉన్ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద సైన్యాధినేత అయ్యాడు. గద్దెనెక్కేనాటికి అతని వయసు 30 ఏండ్లే. అప్పటికి ప్రపంచంలో అతిపిన్న వయస్కుడైన దేశాధీశుడు అతడే. ఇప్పటివరకూ ఉన్ విదేశీ పర్యటనకూ వెళ్లలేదు. ఏ విదేశీ నాయకుడితో భేటీ కాలేదు.

  సవతి సోదరుని హత్య

  సవతి సోదరుని హత్య

  అధికారానికి కొత్త కదా అని ప్రారంభంలో కిమ్‌జోంగ్ ఉన్‌కు మేనత్త కిమ్ క్యోంగ్ హుయ్, ఆమె భర్త జాంగ్‌సుంగ్ టాయక్ పరిపాలనలో తోడ్పడేవారు. మొదట్లో సైన్యంలో, ప్రభుత్వంలో వారిదే హవా. తాను అనుభవం సంపాదించేదాకా అన్నీ చూసుకోమని స్వయంగా ఉన్ వారికి చెప్పాడంటారు. కానీ కొన్నాళ్లకే మామపై అపనమ్మకంతో తిరుగుబాటుకు కుట్రపన్నారనే అభియోగంపై ఆయన కుటుంబాన్ని సమూలంగా అంతం చేశాడు. తర్వాత అంతర్గత సమస్యలతో 2013లో ఉన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇక ఉన్ సవతి సోదరుడు కిమ్‌జోంగ్ నామ్ గత ఫిబ్రవరి 13న మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో విషప్రయోగంతో మరణించాడు. దీనివెనుక ఉన్ హస్తం ఉన్నదనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఉత్తరకొరియా అభీష్టానికి వ్యతిరేకంగా మలేషియా ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లింది. పలువురు ఉత్తరకొరియన్లను, ఇద్దరు విదేశీ మహిళలను అనుమానితులుగా చేర్చింది. దీంతో ఆ రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. మలేషియా ఒకడుగు ముందుకేసి ఉత్తరకొరియా ప్రభుత్వమే హత్య చేయించిందని నేరుగా ఆరోపించింది. దీనిపై మండిపడ్డ ఉన్.. ఉత్తరకొరియాలోని మలేషియన్లు దేశం విడిచిపోరాదని (నిర్బంధ) ఆదేశాలు జారీ చేశాడు. ప్రతీకారంగా మలేషియా ఉత్తరకొరియన్లకు వీసారహిత ప్రవేశాలు నిషేధించింది.

   దక్షిణ కొరియాతో తెగతెంపులు

  దక్షిణ కొరియాతో తెగతెంపులు

  పితూరీల భయంతో అధికారం సుస్థిరం లక్ష్యంతోనో ఏమో ఉన్ అణుఉన్మాదిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దక్షిణకొరియాతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు. దక్షిణ కొరియాను, అమెరికాను అణుబాంబులతో నాశనం చేస్తానని ప్రతిజ్ఞలు చేయడం అంతకంతకూ ఎక్కువైంది. తండ్రి, తాత కూడా బెదిరించినా ఇలా అణు కార్యక్రమాన్ని పరుగులెత్తించలేదు. ఒకవైపు అణ్వస్త్ర సామర్థ్యానికి పదును పెడుతూ మరొకవైపు క్షిపణుల సామర్థ్యం పెంచుకుంటూ పోతున్నారు. ఇదే ధోరణి ఇక ముందు కూడా కొనసాగితే 2020 నాటికి ఉత్తరకొరియా అమ్ముల పొదిలో అమెరికాను సునాయాసంగా చేరుకోగలిగే క్షిపణులు ఉంటాయంటున్నారు.

  ఇలా గాయనితో ఉన్ వివాహం

  ఇలా గాయనితో ఉన్ వివాహం

  ఉన్ జనవరి 8న పుట్టాడని అంటారు. మరి ఏడాది? 1982, 1983/1984. ఏది సరైనది? అధికారిక రికార్డుల్లో మాత్రం 1982 అనే చెప్తారు. తాత కిమ్‌ఇల్ సంగ్ పుట్టిన 70 ఏండ్లకు, తండ్రి కిమ్‌జోంగ్ ఇల్ పుట్టిన 40 ఏండ్లకు ఉన్ పుట్టినట్టుగా లెక్క కట్టించేందుకు ఆ ఏడాదిని ఎంచుకున్నారని అంటారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో సాగింది. గుమలీగెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాక్ ఉన్ అనే మారుపేరుతో చేర్చారు. ఉత్తరకొరియా దౌత్యాధికారి కొడుకుగా చలామణి చేసేవారు. ఉత్తరకొరియా బద్ధశత్రువులుగా పేరుపొందిన దేశాల పిల్లలతోనూ సఖ్యంగానే గడిపేవాడట. స్కూలులో రాజకీయ చర్చపై కఠిన నిషేధం ఉండేది. దాంతో పిల్లలు చక్కగా ఫుట్‌బాల్ గురించో, వంటల గురించో మాట్లాడుకునేవారు. కిమ్‌జోంగ్ ఉన్ పెండ్లి కూడా నిగూఢంగానే జరిగిపోయింది. కొన్నాళ్లుగా ఓ అమ్మాయి ఉన్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఆ తర్వాత ఒకరోజు అధికారిక మీడియా కామ్రేడ్ రిసోల్‌జూను ఉన్ పెండ్లి చేసుకున్నారని ప్రకటించింది. ఆమె ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. పలుకుబడి కల కుటుంబం నుంచే ఆమె వచ్చినట్టు చెప్పుకుంటారు. ఆమె గాయని. పాటలు బాగా పాడుతుంది. కచేరీలు విని అమ్మాయి నచ్చి చేసుకున్నాడట. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం.

  ఆంక్షలున్నా సామర్థ్యం పెంచుకుంటామని ప్రకటన

  ఆంక్షలున్నా సామర్థ్యం పెంచుకుంటామని ప్రకటన

  సైనిక శక్తిలో అమెరికాతో సమ ఉజ్జీగా నిలువాలన్న తమ లక్ష్యానికి చేరువవుతున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. క్షిపణి ప్రయోగంపై దేశాధ్యక్షుడు కిమ్ పూర్తి సంతృప్తి వ్యక్తి వ్యక్తం చేశారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ శనివారం తెలిపింది. క్షిపణి సా మర్థ్యాన్ని, విశ్వసనీయతను ఆయన పరిశీలించారని పేర్కొన్నది. ఈ క్షిపణి ఉపయోగానికి సిద్ధమని కిమ్ ప్రకటించారన్నది. ఒకవైపు అంతర్జాతీయంగా తమపై ఆంక్షలు పెరుగుతున్నా, తమ అణ్వాయుధ కార్యక్రమం పూర్తి చేసి తీరుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అపరిమిత మైన అంతర్జాతీయ ఆంక్షల మధ్య అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో దాదాపు సఫలీకృతమయ్యామని అన్నారు. అమెరికాతో సమ ఉజ్జీగా నిలువాలన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాను గుక్కతిప్పుకోనివ్వని రీతిలో ఎదురుదాడి చేసేలా అణ్వాయుధ శక్తిని సమకూర్చుకోవాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి తమపై ఆంక్షలు విధిస్తున్నా, తాము ఈ విజయాలు సాధించామని కిమ్ చెప్పారు. ఉత్తరకొరియాపై సైనిక చర్య గురించి కనీసం మాట్లాడే సాహసమూ చేయకుండా, అమెరికాతో సైని క శక్తిలో సమ ఉజ్జీగా నిలువడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. భవిష్యత్‌లోనూ మరిన్ని క్షిపణి పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఉత్తర కొరియా శుక్రవారం నిర్వహించిన ఖండాంతర క్షిపణి ప్యాంగ్యాంగ్ నుంచి బయల్దేరి జపాన్ మీదుగా 3,700 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర పెసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. ఆ దేశం ప్రయోగించిన వాటిలో ఇది అ త్యంత దూరం ప్రయాణించిన క్షిపణి అని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ప్రయోగించిన క్షిపణి గత నెల 29న జపాన్ మీదుగా ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి హ్వాసాంగ్-12 వంటిదేనని ఉత్తరకొరియా తెలిపింది.

  అమెరికా సైనిక చర్యలు తీసుకునే అవకాశం?

  అమెరికా సైనిక చర్యలు తీసుకునే అవకాశం?

  ఉత్తర కొరియా శుక్రవారం నిర్వహించిన ఖండాంతర క్షిపణి పరీక్షను రెచ్చగొట్టే చర్య అని, అణ్వాయుధ, క్షిపణి పరీక్షలతో ప్రాంతీయ భద్రతకు, శాంతికి విఘా తం కలిగిస్తున్నదని ఐరాస భద్రతా మండలి పేర్కొన్నది. శనివారం అత్యవసరంగా సమావేశమైన భద్రతా మండలి.. సభ్య దేశాలు ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలను తక్షణమే అమలు చేయాలని సూచించింది. తమను, తమ మిత్ర దేశాలను ఎవరూ బెదిరించి, భయపెట్టలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉత్తరకొరియా నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు తమకు సమర్థ, పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఉత్తరకొరియా తాజా క్షిపణి పరీక్షపై ట్రంప్ ప్రతిస్పందనను అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ తెలిపారు. ఉత్తరకొరియాపై ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్య కూడా తీసుకోవచ్చన్నారు. ఉత్తరకొరియా బలోపేతమైందని ట్రంప్ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో దానికి ముకుతాడు వేసేందుకు ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  North Korea leader Kim Jong Un said the country is nearing its goal of “equilibrium” in military force with the US, as the United Nations Security Council strongly condemned the North’s “highly provocative” ballistic missile test. The North’s official Korean Central News Agency carried Kim’s comments today a day after US and South Korean militaries detected the missile launch from the North Korean capital of Pyongyang. It travelled 3,700 km as it flew over Japan before landing in the northern Pacific Ocean. It was the country’s longest-ever test flight of a ballistic missile.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more