వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే మా కానుక: ట్రంప్‌ను రెచ్చగొట్టేలా కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

|
Google Oneindia TeluguNews

సియోల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికాతోపాటు ఇరుగుపొరుగు దేశాలకు ఆందోళనకు గురిచేస్తూ ఉత్తర కొరియా మంగళవారం ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

జపాన్‌కు షాక్: రెచ్చిన నార్త్‌కొరియా, జీవితంలో ఒక్క మంచి పని చేయవా? అంటూ ట్రంప్ ఫైర్జపాన్‌కు షాక్: రెచ్చిన నార్త్‌కొరియా, జీవితంలో ఒక్క మంచి పని చేయవా? అంటూ ట్రంప్ ఫైర్

ఈ క్షిపణి జపాన్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో పడింది. దీంతో జపాన్ తోపాటు అమెరికా.. ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చే వ్యాఖ్యలు చేశారు.

మీకిదే మా కానుక

మీకిదే మా కానుక

మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం.. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం(జులై 4) సందర్భంగా ఆ దేశానికి ఇస్తున్న బహుమతి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటన చేశారు. ఈ మేరకు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే పీకలదాకా కోపంతో ఉన్న అమెరికాను ఇలాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఉన్.

జపాన్‌లో పడిన క్షిపణి

జపాన్‌లో పడిన క్షిపణి

ఉత్తర కొరియా మంగళవారం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. హ్వాసాంగ్‌-14 అనే ఈ క్షిపణిని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ఉత్తర పాంగ్యాన్‌ ప్రావిన్స్‌ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి.. తూర్పు సముద్రంలోని జపాన్‌ ఆర్థిక మండలిలో పడింది.

అమెరికాలోని అలస్కాను టార్గెట్ చేయగలదు..

అమెరికాలోని అలస్కాను టార్గెట్ చేయగలదు..

అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణుల్లో ఇది అత్యంత సామర్థ్యం గలది కావడం గమనార్హం. ఈ క్షిపణి అమెరికాలోని అలస్కాను చేరగలదని నిపుణులు చెబుతున్నారు. కాగా, దాదాపు 2500 కిలోమీటర్ల ఎత్తుకు చేరినట్లు జపాన్‌ పేర్కొంది.

ట్రంప్ ఫైర్

ట్రంప్ ఫైర్

కాగా.. ఈ క్షిపణికి అతి పెద్ద, బరువైన అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉందని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. మరోవైపు క్షిపణి ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆయనకు జీవితంలో చేయడానికి ఇంతకంటే మంచి పనులు లేవా? చేయలేడా' అని కిమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

English summary
North Korea's intercontinental ballistic missile test was a 'gift' to 'Americans' on their independence day, Pyongyang's official news agency cited leader Kim Jong-Un as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X