ఒకే ఒక్కడు.. చైనాకు ఎదురొడ్డి నిలిచాడు! మోడీని ప్రశంసించిన అమెరికన్‌ మేధో సంస్థ డైరెక్టర్‌

ప్రపంచంలో చైనా ప్రాబల్యానికి ఎదురొడ్డి నిలుస్తున్న ఏకైక రాజనీతిజ్ఞుడు భారత ప్రధాని నరేంద్ర మోడీయేనని ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ మేధో సంస్థ హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణుడు మైకేల్‌ పిల్స్‌బరీ .

వాషింగ్టన్‌: ప్రపంచంలో చైనా ప్రాబల్యానికి ఎదురొడ్డి నిలుస్తున్న ఏకైక రాజనీతిజ్ఞుడు భారత ప్రధాని నరేంద్ర మోడీయేనని ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ మేధో సంస్థ హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణుడు మైకేల్‌ పిల్స్‌బరీ ప్రశంసించారు.

పిల్స్‌బరీ 'సెంటర్‌ ఆన్‌ చైనా స్ట్రాటజీ' డైరెక్టర్‌. చైనా వ్యవహారాలపై మంచి నిపుణుడు. శుక్రవారం కాంగ్రెషనల్‌ కమిటీ ముందు ఆయన వాంగ్మూలమిస్తూ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కలల ప్రాజెక్టు వన్‌ రోడ్‌-వన్‌ బెల్ట్‌ (ఓఆర్‌ఓబీ)పై అమెరికా కూడా నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉందని గుర్తు చేశారు.

Narendra Modi only world statesman to stand up to China on OBOR, says US expert

కానీ భారత ప్రధాని మోడీ మాత్రం చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారంటూ ప్రశంసించారు. అంతేకాదు, 'ఇప్పటిదాకా ప్రపంచంలో చైనాను ఎదిరించి మాట్లాడింది నిస్సందేహంగా మోడీయే..' అని పిల్స్‌బరీ వ్యాఖ్యానించారు.

'భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తూ పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) గుండా చైనా వన్‌ రోడ్‌-వన్‌ బెల్ట్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు..' అని ఆయన పేర్కొన్నారు.

'చైనా కూడా దీనిపై దాడి మొదలుపెట్టింది. ఇండో-పసిఫిక్‌ భావననే వారు అంగీకరించడం లేదు. హిందూ మహాసముద్రాన్ని హిందూ మహాసముద్రంగా మారుస్తామని భారత నేతలు హాస్యంగా మాట్లాడినా.. ఆ మాట వెనుక అర్థం వేరే ఉందని, కోట్ల డాలర్లతో అమెరికన్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తున్నామని చెప్పడమే వారి ఉద్దేశమని..' 'సెంటర్‌ ఆన్‌ చైనా స్ట్రాటజీ' డైరెక్టర్‌ మైకేల్‌ పిల్స్‌బరీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+