చైనా వైబోలో మోడీ-లీ సెల్ఫీ సంచలనం: 3కోట్లు దాటిన హిట్లు
బీజింగ్: చైనా సామాజిక మాధ్యమం వైబోలో చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సెల్ఫీ సంచలనం సృష్టిస్తోంది. దీన్ని ఇప్పటివరకూ 3.18 కోట్ల మంది వీక్షించారు. ఈ సెల్ఫీని శక్తివంతమైన సెల్ఫీగా పాశ్చాత్య ప్రసార మాధ్యమాలు ఇప్పటికే అభివర్ణించాయి.
ప్రపంచంలో ట్విట్టర్లో అత్యధిక వ్యక్తులు అనుసరిస్తున్న వారిలో ఒకరిగా నిలిచిన ప్రధాని మోడీ.. చైనా పర్యటనకు కొంచెం ముందుగా మే 14న వైబోలో ఖాతా తెరిచారు. ఈ ఖాతాలో మోడీని 1.65 లక్షలకు పైగా చైనీయులు అనుసరిస్తున్నారని భారత అధికారులు వెల్లడించారు.
It's selfie time! Thanks Premier Li. pic.twitter.com/DSCTszSnq3
— Narendra Modi (@narendramodi) May 15, 2015 యోగా- థాయ్ చాయ్ కార్యక్రమం అనంతరం లీతో తను తీసుకున్న సెల్ఫీని మోడీ తన ఖాతాలో పోస్ట్ చేశారని అధికారులు చెప్పారు. దీన్ని 3.18 కోట్ల మంది వీక్షించారని పేర్కొన్నారు.

ఈ ఖాతాలో కొంత మంది వ్యక్తులు స్పందిస్తూ.. చైనా పర్యటన అనంతరం కూడా మోడీ ఈ ఖాతాను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని లీతోపాటు పలువురు అధికారులతో సమావేశమయ్యారు.
అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్‌తో సెల్పీ దిగిన మోడీ, మంగోలియా పర్యటనలో మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బెగ్డోర్జ్‌తో సెల్ఫీ తీసుకున్నారు. కాగా,
మోడీకి ట్విట్టర్‌లో 12.3మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications