వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ఇలా ఉంటాడు(ఫొటో)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సూర్యకాంతి పడని సమయంలోని చంద్రుడు ఎలా ఉంటాడో ఈ నాసా ఫొటో చూస్తే తెలుస్తోంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్న సమయంలో సూర్యుడికి చంద్రుడికి భూమి అడ్డుగా వచ్చినప్పుడు తీసిన చంద్రుడి ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) మరోసారి విడుదల చేసింది.

భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సూర్యకాంతి పడనివైపు ఉన్నప్పుడు డీప్‌ స్పేస్‌ క్లైమేట్‌ అబ్జర్వేటరీ(డిస్కవర్‌) ఉపగ్రహం కెమెరా కంటికి ఈ ఫొటో చిక్కింది. డిస్కవర్‌ కెమెరాకు చందమామ ఇలా చిక్కడం రెండోసారి. ఇది ఏడాదిలో రెండోసారి కావడం గమనార్హం.

సూర్య కాంతి పడనందున చంద్రుడు బూడిద రంగులో సాధారణ గ్రహంలా ఉంది. సాధారణంగా మనం చూసే చందమామ ఎప్పుడూ తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అయితే అది సూర్యుడి కాంతి చంద్రుడిపైన పడిన సమయంలోనే మనకు అలా కనిపిస్తుంది.

గతంలో కూడా సూర్యకాంతి పడనివైపు చందమామ ఫొటోను ఈ ఉపగ్రహం తీసి పంపించింది. ప్రస్తుత ఫొటో జులై 5న తీసింది. గత సంవత్సరం జులై 16న కూడా ఇలాంటి ఫొటో తీసింది. ఈ ఫొటోలను ఎర్త్‌ పాలీక్రోమిక్‌ ఇమేజింగ్‌ కెమెరా(ఎపిక్‌) ద్వారా తీశారు. ఇప్పటికే ఈ కెమెరా భూమికి సంబంధించిన పలు ఫొటోలను తీసి పంపింది.

English summary
For only the second time in a year, a NASA camera aboard the Deep Space Climate Observatory (DSCOVR) satellite captured a view of the moon as it moved in front of the sunlit side of Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X