వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై అదృశ్యమైన రోవర్ : ఆచూకీ కోసం చివరి ప్రయత్నంలో నాసా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆపర్చూనిటీ పేరుతో ఓ రోవర్‌ను అంగారకగ్రహంపైకి పంపించారు నాసా శాస్త్రవేత్తలు. నాడు అంతరిక్షరంగంలో ఇదో గొప్ప మైలురాయి. అంగారక గ్రహంపై ప్రయాణించిన రోవర్ ఆ గ్రహంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులు, ఇతరత్ర మార్పులకు సంబంధించి భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్‌కు సంకేతాలు పంపేది. కొద్ది రోజులుగా ఈ రోవర్ కనిపించడం లేదు. దీన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంత కృషి చేసినప్పటికి కూడా అది లభించలేదు. ఇంతకీ ఆరోవర్ ఎలా అదృశ్యమైంది..? ఇందుకు కారణాలేంటి..?

 భూమితో సంబంధాలు తెగిపోయాయి

భూమితో సంబంధాలు తెగిపోయాయి

అంగారక గ్రహంకు సంబంధిచి లోతైన విషయాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన రోవర్‌తో సంబంధాలు తెగిపోయాయి. చివరిసారిగా ఎనిమిది నెలల క్రితం ఆ రోవర్ నుంచి భూమిపై ఉన్న కమాండ్ కంట్రోల్‌కు సంకేతాలు అందాయి. ఇక అప్పటి నుంచి రోవర్ ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రోవర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నామని నాసా తెలిపింది.

 అంగారక గ్రహంపై 2004లో అడుగుపెట్టిన రోవర్

అంగారక గ్రహంపై 2004లో అడుగుపెట్టిన రోవర్

అంగారకుడిపై కనిపించకుండా పోయిన రోవర్ ఆచూకి కోసం చివరి ప్రయత్నం చేస్తామని చెప్పిన నాసా.. ప్రయత్నం విఫలమైతే అంగారకుడి పై ప్రారంభించిన మిషన్‌కు ఇంతటితో ముగింపు పలుకుతామనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపర్చూనిటీ పేరుతో ఉన్న ఈ రోవర్ అంగారక గ్రహంపై 2004లో అడుగుపెట్టింది. ఆ గ్రహంపై 45 కిలోమీటర్లు మేరా ప్రయాణించింది. అయితే గతేడాది బీభత్సమైన దుమ్ముతుఫాను రావడంతో సూర్యుడి నుంచి అంగారకుడిపైకి వచ్చే సూర్యకాంతిని అడ్డుకుంది. దీంతో రోవర్ బ్యాటరీలకు కావాల్సిన రీఛార్జ్ అందలేదు. రోవర్ బ్యాటరీలు సూర్యకాంతి అందడంవల్లే రీఛార్జ్ అవుతాయి.

గతేడాది జూన్‌లో చివరి సంకేతాలు

గతేడాది జూన్‌లో చివరి సంకేతాలు

ఇక బ్యాటరీలు రీఛార్జ్ కాకపోవడంతో రోవర్ కూడా పనిచేయడం ఆగిపోయింది. దీనికోసం నాసా శాస్త్రవేత్తలు మరో ప్రత్యామ్నాయం గురించి కూడా చాలా ఆలోచించారు. రేడియో ఛానెల్స్ ద్వారా సంకేతాలు అందుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే రోవర్‌ నుంచి చివరిసారిగా జూన్ 10,2018న సంకేతాలు అందాయి. ఆ తర్వాత దాన్ని కనుగొనేందుకు 45 రోజుల సమయం తీసుకున్న నాసా ... రోవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంతకాలం సేవలందించిన ఆపర్చూనిటీ రోవర్ మిషన్ కథ ముగిసిందంటూ పేర్కొన్నారు. అయితే అక్టోబరులో మళ్లీ రోవర్ కోసం వేట సాగించారు నాసా శాస్త్రవేత్తలు. జనవరి వరకు రోవర్ ఆచూకీ కోసం ప్రయత్నించిన అధికారులు చివరి ప్రయత్నం చేసి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
US space agency NASA will make one final attempt to contact its Opportunity Rover on Mars late Tuesday, eight months after it last made contact.The agency also said it would hold a briefing Wednesday, during which it will likely officially declare the end of the mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X