వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యుని కరోనాలో నాసా రోదసీ నౌక పార్కర్ సోలార్ ప్రోబ్-దగ్గరగా పయనిస్తున్న వీడియోల రిలీజ్

|
Google Oneindia TeluguNews

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ 'పార్కర్ సోలార్ ప్రోబ్' అద్భుతాలు సృష్టిస్తోంది. సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు నాసా పంపిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' సూర్యుడి కరోనాలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడ చక్కర్లు కొట్టిన వీడియోలు కూడా విడుదల చేసింది. దీంతో ఈ వీడియోలు అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవాలనే వారిలో ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.

సూర్యుడి కక్షలో పయనించిన తొలి అంతరిక్ష నౌకగా పేరు తెచ్చుకున్న 'పార్కర్ సోలార్ ప్రోబ్' తాజాగా సూర్యుడి కరోనాలోకి ప్రవేశించి చక్కర్లు కొట్టిన వీడియోల్ని నాసా విడుదల చేసింది. అంతరిక్ష ప్రయోగాలు ప్రారంభమైన ఆరు దశాబ్దాల తర్వాత ఓ రోదసీ నౌక సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించడమే ఓ అద్భుతమైతే సూర్యుడి కరోనా చుట్టూ అది కొట్టిన చక్కర్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోల్ని నాసా యూట్యూబ్ తో పాటు ఇతర ఛానళ్లలో విడుదల చేసింది.ఇందులో స్టార్ వార్స్ తరహాలో ఉన్న దృశ్యాలు వీక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

nasas parker solar probe video with coronal streamers streak off the sun released

గతంలో సూర్యగ్రహణం సందర్భంగా మాత్రమే సూర్యుడి చుట్టూ ఉన్న సోలార్ స్ట్రీమర్ల దృశ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా సాధారణ సమయాల్లో కూడా సూర్యుడి వాతావరణం ఎలా ఉంటుందో ఈ వీడియోల్లో కనిపిస్తోంది. నాసా పంపిన రోదసీ నౌక 'పార్కర్ సోలార్ ప్రోబ్' సూర్యుడికి వీలైనంత దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సూర్యుడికి ఇది అతి సమీపంలోకి వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచం ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని అద్భుతాన్ని నాసా సుసాధ్యం చేసినట్లవుతుంది. ఆ క్షణాల కోసం శాస్త్రవేత్తలతో పాటు అంతరిక్ష పరిశోధకులు, విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు.

గత నెలలో 'పార్కర్ సోలార్ ప్రోబ్' పంపిన సోలార్ స్ట్రీమర్ల డేటాను విశ్లేషిస్తున్న అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ తాజాగా ఈ వివరాలను యూట్యూబ్ లో పంచుకుంది. ఇందులో 'పార్కర్ సోలార్ ప్రోబ్' లో అమర్చిన వైడ్ ఫీల్డ్ ఇమేజర్ పరికరం సూర్యుడి దగ్గర సాంద్రత కలిగిన ఎలక్ట్రాన్ వంటి పదార్ధాలను అధ్యయనం చేయబోతోంది. అలాగే సూర్యుడి వలయాకారాన్ని కూడా అధ్యయనం చేయబోతోంది.

పార్కర్ సౌర భౌతిక శాస్త్రాన్ని, ముఖ్యంగా సౌర గాలి ఎలా ఉత్పత్తి చేయబడుతుందో బాగా అర్థం చేసుకోవడానికి భారీ అన్వేషణ సాగిస్తోంది. సౌర గాలి అనేది సౌర వ్యవస్థ అంతటా సూర్యుడి నుండి నిరంతరం ప్రవహించే చార్జ్డ్ కణాల సమితి; భూమి వద్ద, అవి అరోరల్ యాక్టివిటీ నుండి ఉపగ్రహాలు, వ్యోమగాములకు రేడియేషన్ ప్రమాదాల వరకు ప్రతిదీ ప్రభావితం చేస్తాయి.

ఏప్రిల్‌లో, అంతరిక్ష నౌక సూర్యుని కనిపించే ఉపరితలం నుండి 15 సౌర రేడియాల కంటే తక్కువగా వెళ్ళింది, దీనిని ఫోటోస్పియర్ అని పిలుస్తారు, ఈ సమయంలో ఇది "సూడో స్ట్రీమర్" ను గుర్తించింది, ఇది మొత్తం సూర్యగ్రహణ సమయంలో మీరు భూమి నుండి చూడగలిగే భారీ నిర్మాణాలలో ఒకటి.

English summary
The nasa has released latest videos of parkar solar probe flewing inside the sun's corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X