వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000th Asteroid: బీ అలర్ట్: భూమి వైపు గ్రహశకలం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. మరో అరుదైన ఘనతను అందుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఆరితేరిన నాసా.. ఇప్పటిదాకా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. కలలో కూడా ఊహించని కొన్ని వింతలను గుర్తించింది. విశ్వంతరాల్లో సంభవించే అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వాటిపై విస్తృతంగా పరిశోధనలను సాగిస్తూ వస్తోంది. తాజాగా మరో ల్యాండ్ మార్క్‌ను అందుకుంది. జంట గ్రహశకలాలను గుర్తించింది నాసా. దీనితో ఇప్పటిదాకా నాసా గుర్తించిన మొత్తం అస్టరాయిడ్ల సంఖ్య 1001కి చేరింది.

కాలిఫోర్నియా పసడోనాలో నాసా నెలకొల్పిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన రాడార్లు ఈ నియర్ ఎర్త్ అస్టరాయిడ్లను కనుగొన్నాయి. నాసా కనిపెట్టిన గ్రహశకలాల సంఖ్య.. దీనితో వెయ్యిని దాటింది. భూమికి 1.7 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో కంటికి కనిపించనంత వేగంతో పరిభ్రమిస్తోన్న ఓ అస్టరాయిడ్‌ను కిందటి నెల 15వ తేదీన గుర్తించింది. దీని సంఖ్య 1000. (1000th Asteroid) అదే పేరుతో దాన్ని పిలుస్తోంది. సమీప భవిష్యత్తులో ఇది భూమికి మరింత చేరువ కావడానికి అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు.

 NASAs Radar Spots 1000th Near-Earth Asteroid Since 1968

భూమికి అత్యంత సమీపానికి వచ్చే అవకాశాలు ఉండటం.. నాసా ఖాతాలో 1000వ గ్రహశకలం కావడం వల్ల ఇది వార్తల్లోకి ఎక్కింది. 1968లో నాసా రాడార్ అబ్జర్వేషన్ మొట్టమొదటిసారిగా 1566 ఐకారస్ అస్టరాయిడ్‌ను గుర్తించింది. అప్పటి నుంచి వరుసగా వాటిని గుర్తిస్తూ వస్తోంది. పరిభ్రమణాన్ని లెక్కిస్తూ, భూమికి ఏవైనా ప్రమాదం? లేదా? అనే విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది నాసా. ఈ సిరీస్‌లో వెయ్యికిపైగా అస్టరాయిడ్లను గుర్తించింది.

ఇదివరకు నాసా గుర్తించిన గ్రహశకలాలతో పోల్చుకుంటే- పరిమాణంలో ఇది చిన్నదే. జెట్ ప్రొపెల్షన్ ల్యాబొరేటరీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ అస్టరాయిడ్ పరిమాణం 65 నుంచి 100 అడుగులు. ఇది భూమికి చేరువ అయినప్పటికీ.. ఎలాంటి ప్రమాదం లేదని నాసా ల్యాబొరేటరీ అంచనా వేస్తోంది. అదే నెల 22వ తేదీన మరో గ్రహశకలాన్ని గుర్తించింది. దాని సంఖ్య 1001. కాలిఫోర్నియాలోని బార్‌స్టోవ్‌లో నాసా నెలకొల్పిన గోల్డ్‌స్టోన్ యాంటెన్నా దీన్ని కనిపెట్టింది. దీనికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించింది.

1.4 కిలోమీటర్ల వైశ్యాలం గల ఈ గ్రహశకలం గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని లెక్క గట్టారు నాసా శాస్త్రవేత్తలు. కిందటి నెల 21వ తేదీన భూమికి 3.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇది దూసుకెళ్లిందని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఆస్ట్రానమర్ శంతను నాయుడు చెప్పారు. పది సంవత్సరాల వ్యవధిలో గ్రహశకలాల తాకిడి పెరిగినట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. ఇదివరకటి కంటే ఈ పదేళ్లలో అస్టరాయిడ్ల సంఖ్య ఓ మోస్తరు పెరిగిందని అన్నారు.

English summary
NASA’s Jet Propulsion Laboratory (JPL) the 1000th Near-Earth Asteroid (NEA) has been tracked, when its radars picked up 2021 PJ1 as it approached Earth at a distance of barely 1.7 million kilometres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X