మార్స్‌పై ఎడారి దిబ్బలు: నీలంరంగులో: టెక్సాస్ సిటీ అంత విస్తీర్ణంలో: షాక్‌లో నాసా
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ నాసా.. అంగారక (Mars) గ్రహానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. అంగారక గ్రహం ఉత్తర ధృవానికి సంబంధించిన ఫొటోలు అవి. ఒడిస్సీ ఆర్బిటర్ వాటిని చిత్రీకరించింది. ఒక్కో ఫొటో ఫ్రేమ్‌లో 19 మైళ్ల విస్తీర్ణంతో కూడిన మార్స్ నార్త్ పోల్ ఫొటోలను తీసినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తర ధృవంలో ఏర్పడిన ఇసుక దిబ్బలు.. ఓ ఎడారిని తలపించేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒడిస్సీ ఆర్బిటర్ చిత్రీకరించిన ఒక్కో ఫొటో విస్తీర్ణం టెక్సాస్ సిటీ అంత పరిమాణంలో ఉంటుందని అంచనా వేశారు. విస్తీర్ణంలో అమెరికాలోనే రెండో అతి పెద్ద స్టేట్.. టెక్సాస్. అంత భారీస్థాయిలో అంగారకుడి ఉత్తర ధృవంలో ఓ సముద్రాన్ని తలపించేలా దిబ్బలు ఏర్పడటం నాసా పరిశోధకులకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాలి వీస్తే గానీ.. అలాంటి దిబ్బలు ఏర్పడటం అసాధ్యమనే అభిప్రాయం వారిలో నెలకొంది. ఒకభాగం మొత్తం నీలం రంగులో మెరుసిపోతూ కనిపించింది.

మరో భాగం ముదురు బంగారు వర్ణంలో ఇసుక మేటలు మేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నాసా పరిశోధకులు చెబుతున్నారు. నీలంరంగు ఆవరించిన ప్రాంతంలో అత్యంత శీతల పరిస్థితులు ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇక్కడ -150 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వాతావరణం ఉండొచ్చంటూ ఇదివరకే వెల్లడించారు. ఇసుక దిబ్బలు కనిపించిన ప్రదేశం మొత్తం అత్యంత ఉష్ణోగ్రతతో నిండిపోయి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

ఒడిస్సీ ఆర్బిటర్‌లో అమర్చిన థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్ (థెమిస్) వ్యవస్థ ఆ ఫొటోలను తీసినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఫొటోల్లో కనిపించిన దిబ్బల గురించి అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 24వ తేదీన నాసా ఈ ఒడిస్సీ ఆర్బిటర్‌ను ప్రయోగించింది. 20 సంవత్సరాలుగా ఇది అంతరిక్షంలో తిరుగాడుతోంది. 20 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా ఈ ఒడిస్సీ ఆర్బిటర్ తమకు పంపించిన అతిపెద్ద గిఫ్ట్‌గా తాము భావిస్తున్నట్లు నాసా పేర్కొంది.












Click it and Unblock the Notifications