Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాసల్ వ్యాక్సిన్ పాక్ ముక్కుకు రుద్దుతాం: యూఎన్ వేదికపై మోడీ విసుర్లు

ప్రజాస్వామ్యానికి భారత్ ఉదహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వైవిధ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోడీ మాట్లాడారు. ఇండియా డెవలప్ అయితే ప్రపంచం వృద్ది చెందిందని తెలిపారు. దేశంలో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం పరివర్తనం చెందిందని పేర్కొన్నారు.

కరోనా వైరస్ కోసం ఉత్పత్తి చేస్తోన్న వ్యాక్సిన్ల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. మహాసముద్రాల వనరులను కూడా చక్కగా ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని రాజకీయ వస్తువుగా అనుకుంటుందని తెలిపారు. ఆప్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపన ముఖ్యం అని చెప్పారు. దేశంలో ముక్కులో వేసే వ్యాక్సిన్/ డ్రాప్స్ తయారు చేస్తున్నామని మోడీ తెలిపారు. దానిని తొలుత పాకిస్తాన్ ముక్కుకు రుద్దుతామని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికపై దాయాది తీరును మోడీ ఎండగట్టారు. నెగటివ్ ఆలోచనలు ఉగ్రవాదానికి దారితీస్తాయని తెలిపారు. కానీ దానిని రాజకీయంగా వాడుకొవద్దని హితవు పలికారు.

 nasal vaccines to rubbing Pakistans nose: PM Modi

అంతకుముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. కరోనా వైరస్ నివారణ, ప్రజల హక్కులు గురించి ఆయన డిస్కష్ చేశారు. ప్రపంచం తీవ్ర భావజాలాన్ని ఎదుర్కొంటుందని వివరించారు. యావత్ ప్రపంచం శాస్త్ర సాంకేతికంగాతోపాటు.. అభివృద్ధి గురించి ఆలోచించాలని కోరారు. దేశం అనుభవంతోపాటు మరింత నేర్చుకోవాలని కోరారు. ఆప్ఘనిస్తాన్ గురించి కూడా మోడీ మాట్లాడారు. ఆ దేశంలో ఉన్న మహిళలు, చిన్నారులు, మైనార్టీల కోసం పాడుపడాలని అభిప్రాయపడ్డారు. ఆ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు/ ఉగ్రవాదంతో ఆ దేశం ఇబ్బందులను ఎదుర్కొనేదని వివరించారు.

ఉగ్రవాదం దేశాన్ని నాశనం చేస్తుందని.. ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. గత వందేళ్లలో లేని విపత్తును ప్రపంచం ఎదుర్కొంటుందని మోడీ వివరించారు. కరోనా వైరస్ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి మోడీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుందని మోడీ గుర్తుచేశారు. దేశంలో పదుల భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు, వేషధారణ ఉన్న భారత్ ఒక ఉప ఖండం అని పేర్కొన్నారు. టీ స్టాల్‌లో టీ అమ్ముకునే చిన్నారి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం తన దేశం కల్పించిందని వివరించారు. తొలుత సీఎంగా పనిచేశానని.. ఇప్పుడు ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నానని నరేంద్ర మోడీ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+