శుభవార్త: రక్షణ రంగంలో అమెరికాతో భారత్ కలిసి పనిచేయాలని నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్ :రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా, భారత్ లు నిర్ణయం తీసుకొన్నాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలిసి పనిచేయనున్నాయి.

భారత జాతీయ భద్రతా సలహదారుల అజిత్ ధోవల్ గత మూడు రోజుల్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్ కెల్లీతో పాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్ మెక్ మాస్టర్ లతో సమావేశమయ్యారు.

దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల కోసం భారత్ చేస్తున్న కృషిని మాటిష్ కొనియాడారు. పెంటగాన్ ప్రతినిధఇ జెఫ్ డేవిస్ వెల్లడించారు.

national security advisor ajit doval's US Visit Reinforces Counter-Terrorism Cooperation

జాన్ కెల్లీతో ధోవల్ జరిపిన చర్చల్లో సరిహద్దు నియంత్రణ ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చాయి.పాకిస్తాన్ గుర్తించి ప్రత్యేకంగా చర్చ జరగలేదని సమాచారం.

న్యూఢిల్లీ అభిప్రాయాలు తెలుసుకొనేందుకుగాను దోవల్ జరిపిన చర్చలకు ట్రంప్ ప్రభుత్వాధికారులు అమితంగా ఆసక్తిని కనబర్చారని తెలిసింది.డిమానిటైజేషన్ , జిఎస్ టీ బిల్లు గురించి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ ఆర్థికాభివృద్ది అంశాలపై అమెరికా ఆసక్తిని చూపుతున్నట్టు వెల్లడించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Trump Administration is seeking to deepen its counter-terrorism cooperation with India and expand it further, sources here said after National Security Advisor Ajit K Doval's high profile meetings with top US officials.
Please Wait while comments are loading...