వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ పాకిస్తాన్‌లో అంతర్భాగం, బాధపడుతున్నా : నవాజ్ షరీఫ్

కాశ్మీర్, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హన్ వాని పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి వ్యాఖ్యలు చేశాడు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: కాశ్మీర్, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హన్ వాని పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్‌ పాకిస్థాన్‌లో అంతర్భాగమేనని షరీఫ్‌ అన్నాడు. కాశ్మీర్‌ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.

ఈ సందర్భంగా బుర్హాన్‌ వానీని పొగిడారు. బుర్గన్ వానీ శక్తిమంతమైన, ప్రజాకర్షణ గల నాయకుడన్నాడు. కాశ్మీరీ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారన్నాడు. అమరుడైన బుర్హన్ వానీ కాశ్మీరీ ఉద్యమానికి సరికొత్త మలుపు ఇచ్చాడన్నాడు.

nawaz sharif

భద్రతా బలగాలు బుర్హన్ వానిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ కాశ్మీరీలు చేస్తున్న ఆందోళనలను భారత బలగాలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకు చింతిస్తున్నామన్నాడు.

కాశ్మీర్‌ ప్రజలు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి పాకిస్తాన్ మద్దతు తెలిపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నాడు. కాశ్మీర్ పరిస్థితులను పలు దేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక రాయబారులను పంపిందన్నాడు.

English summary
Nawaz Sharif ticks off India again on Burhan Wani, Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X