వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Whales:సముద్రం ఒడ్డున చిక్కుకుపోయిన 400 తిమింగలాలు మృతి.. ఎలా ఇరుక్కుపోయాయి..?

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియాలో గత వారంలో దాదాపు 500 తిమింగలాలు సముద్రం ఒడ్డున చిక్కుకుపోయాయి. ఇందులో 380 తిమింగలాలు చనిపోయాయి. ఇలా ఇంత పెద్ద సంఖ్యలో తిమింగలాలు చనిపోవడం ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు 90 తిమింగలాలను ప్రాణాలతో కాపాడగలిగారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని టస్మానియా బీచ్‌లో చోటుచేసుకుంది. కొన్ని వందల సంఖ్యలో తిమింగలాలు సముద్రపు ఒడ్డున ఇసుకలో కనిపించాయి. కొన్ని తిమింగలాలు మరో ఆరుమైళ్ల దూరంలో కనపించాయి. ప్రాణాలతో బయటపడ్డ కొన్ని తిమింగలాలు మాత్రం బతుకేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అసలు ఈ తిమింగలాలు ఎలా ఒడ్డున చిక్కుకుపోయాయి..?

 సముద్రం ఒడ్డున చిక్కుకుని తిమింగలాలు మృతి

సముద్రం ఒడ్డున చిక్కుకుని తిమింగలాలు మృతి

బతికిన కొన్ని తిమింగలాలు తిరిగి సముద్రంలోకి వెళ్లి మళ్లీ చిక్కుకుపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. సముద్రంలో అలలు బలంగా ఎగిసిపడుతున్నందున ఈ తిమింగలాలు మళ్లీ చిక్కుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాటిని రక్షించాలంటే చాలా కష్టమని చెబుతున్నారు మెరైన్ బయాలజీ పరిశోధకులు కరేన్ స్టాకిన్. వాటిని కాపాడి తిరిగి వేరే ప్రాంతంలో వదిలేందుకు సౌకర్యాలు లేద సదుపాయాలు ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేయొచ్చని చెబుతున్నారు. సాధారణంగా టస్మానియా సముద్రంలో ఉష్ణోగ్రతలు చల్లగా ఉండి ఉంటే చాలా వరుకు తిమింగలాలు బతికేవని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు ఒక తిమింగలంను కాపాడాలంటే ఐదుగురు మనుషులు కావాలని ముందుగా అవి ఇసుకలో చిక్కుకుపోయి ఉంటాయి కాబట్టి వాటిని ఎత్తగలగాలని చెప్పారు. ఆ తర్వాత నేరుగా వాటిని సముద్రంలోకి వదిలే ఏర్పాటు చేయాలని చెప్పారు.

 తిమింగలాలను బతికించడం కష్టమే

తిమింగలాలను బతికించడం కష్టమే

ఇక ఒక్కో తిమింగలం 20 అడుగుల పొడవుతో ఉండటం అదే సమయంలో కొన్ని టన్నుల బరువు ఉండటం వల్ల వాటిని ప్రాణాలతో కాపాడగలిగినా సముద్రంలోకి వదలడం కష్టమవుతుందని చెప్పారు. ఒకవేళ అవి చనిపోయినా కూడా వాటిని ఎత్తి పక్కన పెట్టడం కూడా కష్టమైన పనే అని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువు ఉండటం వల్ల అవి ఇసుకలో చిక్కుకున్నప్పుడు వాటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. 1996లో కూడా 320 తిమింగలాలు పాశ్చాత్య ఆస్ట్రేలియాలో ఇలానే చిక్కుకుని చనిపోయాయని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా తిమింగలాలు సముద్రంలో ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి. అయితే అన్నీ ఒకేసారి గుంపుగా చిక్కుకుపోతాయి. అక్కడక్కడ ఒకటి లేదా రెండు తిమింగలాలు ఒంటరిగా చిక్కుకున్నాయంటే అందుకు అవి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయని అర్థం చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

 రోమన్ల థియరీ ఇదీ..

రోమన్ల థియరీ ఇదీ..

ఇక తిమింగలాలు ఎందుకు ఎప్పుడు చిక్కుకుంటాయనే దానిపై పలు రకాల వాదనలు ఉన్నాయి. పూర్వ కాలం నుంచే ఇది జరగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సముద్రంలో చనిపోయిన తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. కానీ సముద్రంను వీడి ఒడ్డుకు మరికొన్ని అదేపనిగా వస్తాయి. ఇలా ఎందుకువస్తాయో ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రముఖ గ్రీకు తత్వవేత్త కూడ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కొన్ని శతాబ్దాల తర్వాత రోమన్లు మరో వాదన వినిపించారు. సముద్రంకు దేవుడిగా ఉన్న నెప్ట్యూన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందునే ఇలా తిమింగలాలను ఇసుకలో చిక్కుకునేలా శిక్ష వేశాడని రోమన్లు నమ్మారు.

English summary
Whales are known to strand themselves on beaches across the world and they do so singularly or in groups. There are a few theories for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X