Nepal Floods: ఛీ.. ఛీ.. మీకంటే రాబందులు నయం కదా.. వరదల్లో చనిపోయిన మహిళనూ వదల్లేదు..!

భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ లో ఆగస్ట్ 26న సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు, బురద, రాళ్లు, శిథిలాలు దిగువన ఉన్న ప్రాంతాల్ని ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. నేపాల్ లో ఎక్కడ చూసినా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 500 లకుపైగా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వందలాది మంది విదేశీ పర్యాటకులు, భద్రతా సిబ్బంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు శుక్రవారం ఉదయం నాటికి 1,545 మందిని రక్షించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.

Nepal floods viral video Two arrested for stealing earrings from a woman who died the Nepal floods

ఓవైపు వరదల్లో కొట్టుకుపోయిన తమ వారి కోసం బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆకతాయిలు రాబందుల్లా మారి చనిపోయిన వారి శరీర భాగాలపై ఉన్న ఆభరణాలు, బంగారాన్ని కాజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వరదల్లో చనిపోయిన మహిళ ఒంటి మీద ఉన్న చెవి కమ్మలు తీసేస్తున్న వీడియో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు ఆ ఇద్దరిని పట్టుకున్నారు. వీడియో ఆధారంగా 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా గుర్తించారు. భరత్‌ పూర్ లోని పోఖరా బస్ పార్క్ దగ్గర వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఆ మహిళ చనిపోయిందని కూడా జాలి లేకుండా మృత దేహాన్ని ఇష్టం వచ్చినట్లు జుట్టు పట్టుకుని పైకి లాగి ఆ మహిళ చెవులకు ఉన్న గోల్డ్ ను లాక్కున్నారు. ఆ మృత దేహాన్ని ఓ కర్ర సాయంతో ఒడ్డుకు లాక్కుని.. పైన కూర్చొన్న వాళ్లు ఇలా రాబందులకంటే హీనంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా చుట్టు పక్కల వాళ్లు ఆ దొంగలను ఏమీ అనకుండా చూస్తుండిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక్కసారిగా ఈ వీడియోపై నేపాల్ తో పాటు ఇతర దేశాల్లోనూ ఆగ్రహజ్వాలలు ఎగిశాయి. దాంతో నేపాల్ పోలీసులు వారిని గుర్తించి తాజాగా అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+