Nepal Floods: నేపాల్ లో వరదలు.. 600 కు చేరువలో మృతుల సంఖ్య..!

భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు, బురద, శిథిలాలు దిగువన ఉన్న ప్రాంతాల్ని ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకూ 579 కు చేరుకుంది. ఇక ఏకంగా 1,924 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.

మరోవైపు చైనా నుంచి నేపాల్‌ కు సురక్షితంగా చేరుకున్న భారతీయుల జాబితాను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 149 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్​వాల్ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు 320 మందికి పైగా భారతీయులు గల్లంతు అయినట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అలాగే చైనాలో ఉన్న 400 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు తెలిపింది.

Nepal Floods wreak havoc in Nepal 1 924 missing death toll nears 600 Floods Nepal tragedy nepal

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న సాయంపై నేపాల్ వింత వైఖరి ప్రదర్శిస్తోంది. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ మాత్రం వద్దని చెబుతోంది. ఈ మేరకు చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. అయితే సహాయక సామాగ్రి, వైద్య సామాగ్రి, ఆర్థిక విరాళాలను తాము స్వీకరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు విపత్తు సంభవించిన తొలి దశలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న తమ సొంత భద్రతా బలగాలను వినియోగించడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+