IHU: గుబులు పుట్టిస్తోన్న కరోనా కొత్త వేరియంట్: ఒమిక్రాన్ కంటే భయానకం

పారిస్: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 37,379 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. రెండు రోజుల కిందట 22 వేలుగా రికార్డయిన కొత్త కేసులు ఇప్పుడు 40 వేలకు చేరువ కావడం కలకలం రేపుతోంది.

దీనికితోడు ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1892కు చేరాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీన్ని ఐహెచ్‌యు (IHU)గా గుర్తించారు నిపుణులు. ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్‌కు చెందిన 12 పాజిటివ్ కేసులు ఒకేసారి వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా విస్తరిస్తోందని ఫ్రాన్స్ ప్రకటించింది. బీ.1.640.2గా గుర్తించినట్లు తెలిపింది.

New Covid19 variant IHU found in France, as travel history from Cameroon, is more stronger than Omicron

ఈ కొత్త మహమ్మారిలో దాదాపు 46 వరకు మ్యుటేషన్లు ఉన్నాయని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌కు కూడా ఇది లొంగట్లేదని స్పష్టం చేసింది. ఐహెచ్‌‌యు బారిన పడిన వారు డబుల్ డోస్ వ్యాక్సిన్లు తీసుకున్నారని వివరించింది. ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ ప్రావిన్స్‌లో కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. కామెరాన్ ట్రావెల్ హిస్టరీ ఉన్న వారిలో ఇది తొలిసారిగా కనిపించిందని, అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన వ్యక్తికీ ఈ ఐహెచ్‌యు వేరియంట్ సోకినట్లు ఫ్రాన్స్ వైద్య నిపుణులు గుర్తించారు.

ఈ వేరియంట్ అరుదైనదని, ముప్పు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇందులో ఎన్ 501 వై, ఈ484కేతో సహా 14 అమైనో యాసిడ్ సబ్‌స్టిట్యూషన్స్, స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అందులో కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని వివరించారు. నిపుణులు చేసిన ఈ హెచ్చరికలతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని తెలిపింది. ఇప్పటికే హాఫ్ లాక్‌డౌన్ ప్రకటించామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+