సిలికాన్ వ్యాలీలో కలకలం.. "సె* వార్‌ఫేర్" రచ్చ !

అమెరికా సాంకేతిక రంగానికి గుండెకాయలాంటి "సిలికాన్ వ్యాలీ"లో కలకలం రేగుతోంది. “సెక్స్ వార్‌ఫేర్” అనే కొత్త తరహా గూఢచర్యం భయానక వాతావరణాన్ని సృష్టించింది. ప్రపంచ టెక్ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే లక్ష్యంతో చైనా, రష్యా వంటి దేశాలు అందమైన యువతులను గూఢచారిణులుగా ఉపయోగిస్తూ అమెరికా కంపెనీల రహస్యాలను దోచుకునేందుకు యత్నించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

సెక్స్ ఆధారిత గూఢచర్యం..

ఈ గూఢచారిణులు టెక్ కంపెనీల సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, పరిశోధకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తారు. కొంతమంది వారిని వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబ స్థాయిలో సంబంధాలు పెంచుకుని.. దశాబ్దాలపాటు కంపెనీ రహస్యాలపై నియంత్రణ సాధిస్తారు. నిఘా నిపుణుల ప్రకారం ఇది గతంలో ప్రాచుర్యంలో ఉన్న “హనీట్రాప్” విధానానికి ఆధునిక రూపంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతి సాంకేతిక రంగానికి పెద్ద ముప్పుగా మారింది.

new-warfare-risks-silicon-valley-tech-companies-and-news-got-viral

చైనా, రష్యా గూఢచారుల సీక్రెట్ మిషన్..

చైనా, రష్యా గూఢచార సంస్థలు ఈ వ్యూహాన్ని క్రమబద్ధంగా అమలు చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన యువతులు LinkedIn, X (Twitter), అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్సులు వేదికగా టెక్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

దీనిపై పామిర్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ ముల్వెనాన్ మాట్లాడుతూ.. తనకు లింక్డ్‌ ఇన్‌లో అనేక ఆకర్షణీయమైన చైనీస్ మహిళల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. వారు టెక్ ప్రాజెక్టుల పేరుతో క్లోజ్ అవుతున్నారని చెప్పారు. వర్జీనియాలో జరిగిన ఒక సమావేశంలో ఇద్దరు చైనీస్ మహిళలు తనను నేరుగా సంప్రదించే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

స్టార్టప్‌లను లక్ష్యంగా చేసుకున్న కొత్త పద్ధతి..

ఇక గూఢచర్యం ఇప్పుడు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, స్టార్టప్‌ల రూపంలో కూడా జరుగుతోంది. అమెరికా స్టార్టప్‌లను ఆకర్షించేందుకు చైనా పెట్టుబడిదారులు, టెక్ సమ్మిట్‌లు, పోటీలు నిర్వహిస్తూ, వాటి వ్యాపార మోడల్స్‌, సాంకేతిక ఆవిష్కరణలను సమగ్రంగా సేకరిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, చైనా ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు "Innovation Exchange" పేరిట టెక్ కంపెనీల డేటా, AI ఆల్గారిథమ్స్‌, చిప్ డిజైన్‌లు దోచుకుంటున్నట్లు గుర్తించారు.

అమెరికాకు భారీ నష్టం..

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు $600 బిలియన్ల విలువైన మేధో సంపత్తి దొంగతనం జరుగుతోంది. ఇందులో అధిక భాగం చైనా మూలంగా జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం టెక్ కంపెనీలకు మాత్రమే కాకుండా, దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతోంది.

AI, డిఫెన్స్ రంగాలపై దృష్టి..

సిలికాన్ వ్యాలీలోని ప్రధాన లక్ష్యాలు కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్‌, సైబర్ సెక్యూరిటీ, రక్షణ టెక్నాలజీలకు సంబంధించిన కంపెనీలు. ఈ రంగాల్లో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడం కోసం చైనా ప్రభుత్వం అనధికారికంగా “సాంకేతిక గూఢచర్య బృందాలను” ఏర్పాటు చేసిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఇందులో చైనా మాత్రమే కాకుండా దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, ఇరాన్ వంటి దేశాలు కూడా అమెరికా టెక్ రంగంలో సైలెంట్ గా నిఘా కార్యక్రమాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌ల ద్వారా అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్‌పై పరోక్ష పర్యవేక్షణ చేస్తున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో FBI, CIA సంస్థలు టెక్ రంగం ఉద్యోగులకు కఠినమైన భద్రతా మార్గదర్శకాలను జారీ చేశాయి. అజ్ఞాత సోషల్ మీడియా కాంటాక్ట్స్‌ను తిరస్కరించడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకపోవడం, వ్యాపార ప్రాజెక్టుల వివరాలను రక్షించడం వంటి సూచనలు అందించారు. FBI ఇప్పటికే 200 కంటే ఎక్కువ “హనీట్రాప్ కేసులు”ను విచారిస్తున్నట్లు సమాచారం.

టెక్ దిగ్గజాలకు సవాల్..

ఈ క్రమంలోనే గూగుల్‌, ఆపిల్‌, ఎన్‌విడియా, టెస్లా వంటి కంపెనీలు కూడా తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను పునరాలోచిస్తున్నాయి. “సెక్స్ వార్‌ఫేర్” రూపంలో జరుగుతున్న ఈ గూఢచర్యం ఇప్పుడు అమెరికా టెక్ ప్రపంచానికి కొత్త యుద్ధం లాంటిదిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+