న్యూయార్క్ హైసెక్యూరిటీ జోన్ లో ఘోరం.. ఉలిక్కిపడ్డ అమెరికా

అమెరికాలో గన్ కల్చర్ పేట్రేగింది. మరోసారి తుపాకీ గర్జించింది. అమాయకుల ప్రాణాలను తీసింది. మన్ హట్టన్ లో చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని కూడా న్యూయార్క్ పోలీసులు కాల్చి చంపారు.

న్యూయార్క్ లోని మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో.. పార్క్ అవెన్యూ, ఈస్ట్ 51వ స్ట్రీట్ లో ఆ దేశ కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. స్థానికంగా ఓ స్కైస్క్రాపర్‌లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ అధికారి సహా నలుగురు మరణించారు. అనంతరం పోలీసులు ఆ దుండగుడిని హతమార్చారు.

New York City officials said that the suspect was neutralised

మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని ఎన్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయం, బ్లాక్‌స్టోన్ వంటి అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంతాన్నీ హైసెక్యూరిటీ జోన్ గా పరిగణిస్తారు. అలాంటి చోటే కాల్పులు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది.

అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. నిందితుడిని నెవాడాకు చెందిన 27 ఏళ్ల షేన్ తమూరాగా గుర్తించారు. సాయంత్రం 6:15 నిమిషాల సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మిడ్ టౌన్ లో కాల్పులు సంభవించినట్లు 6:30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ అందినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తొలుత షేన్ తమూరాను లొంగిపోవాలంటూ ఆదేశించారు. దీన్ని పట్టించుకోకపోవడంతో ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను మరణించినట్లు NYPD అధికారులు తెలిపారు.

అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో సంఘటనస్థలం మొత్తం భీతావహంగా మారింది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో పోలీసులు హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో అనేక ఫైవ్-స్టార్ బిజినెస్ హోటల్స్‌తో పాటు కోల్‌గేట్ పామోలివ్, కేపీఎంజీ వంటి కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

ఈ కాల్పుల్లో చాలా మందికి గాయాలయ్యాయని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఓ వీడియోను పోస్ట్ చేశారాయన. మరణించిన పోలీస్ అధికారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+