శీతాకాలం కరోనా పంజా.. ఫిబ్రవరి నాటికి లక్షన్నర మరణాలు ..యూఎస్ లో అలెర్ట్
కరుణ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా తీవ్ర ప్రభావానికి గురైన దేశాలలో అగ్రస్థానంలో నిలిచింది అగ్రదేశం అమెరికా. యునైటెడ్ స్టేట్స్ లో 2021 ఫిబ్రవరి చివరినాటికి కరోనా వైరస్ కారణంగా ఒకటిన్నర లక్షలకు పైగా ప్రజలు చనిపోవచ్చని అంచనా వేస్తోంది వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్. అయితే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తే మాత్రం ఒక లక్ష 30 వేలకు పైగా ప్రాణాలను కాపాడవచ్చు అని అధ్యయనం వెల్లడించింది.

శీతాకాలంలో పంజా విసరనున్న కరోనా .. అధ్యయనంలో వెల్లడి
కరోనా వైరస్ చికిత్స పెద్ద ప్రభావవంతంగా పనిచేయకపోవడంతో పాటు, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాని కారణంగా యూఎస్ లో కరోనా వైరస్ దారుణ స్థితిని సృష్టించింది. ప్రపంచంలోనే కరోనా కారణంగా దెబ్బతిన్న దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది యూఎస్. ఇక ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ శీతాకాలపు సమస్యలు ఎదుర్కొంటుంది. శీతాకాలం లో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్త వహించాలి అంటూ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ డైరెక్టర్ క్రిస్ ముర్రే ఒక ప్రకటనలో తెలిపారు.

డేంజర్ జోన్ లోకి యూఎస్ ... వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ అలెర్ట్
ప్రస్తుత శీతాకాలం సమీపిస్తున్న వేళ డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాము అంటూ పేర్కొన్న ఆయన దేశం ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కొంటోందని క్రిస్ ముర్రే తెలిపారు. దేశంలో తాజా పరిస్థితి కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది అనడానికి ఎలాంటి నమ్మకాన్ని కలిగించడం లేదని ఆయన పేర్కొన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి జనాభా అత్యధికంగా కలిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అధిక స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో అక్కడ ఆసుపత్రులు మౌలిక వనరుల డిమాండును ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో అంచనా వేశారు.

ఫిబ్రవరి నాటికి లక్షన్నరకు పైగా మరణాలకు అవకాశం ... మాస్కులతోనే రక్షణ
డిసెంబర్ చివరిలో మరియు జనవరిలో రోజు వారి మరణాల స్థాయి పెరుగుతుందని ముర్రే పేర్కొన్నారు. అయితే ప్రజలందరూ మాస్కులు ధరించడం ద్వారా మరణాల రేటు తగ్గించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాజా కరోనావైరస్ ప్రభావాన్ని బట్టి, వ్యాప్తిని బట్టి ఫిబ్రవరి 1 నాటికి 386,000 మరణాలను నమోదు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మాస్కుల వాడకాన్ని విస్తరించడమే యునైటెడ్ స్టేట్స్ కు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు.
Recommended Video

మాస్కుల వాడకంపై కఠిన నిబంధనలు ..యూఎస్ లో ఇదో దుమారం
ఐరోపా లోని కొన్ని ప్రాంతాలతో పాటు, కరోనా వైరస్ అత్యధికంగా ప్రభావం చూపిస్తున్న ఇతర ప్రాంతాలు ఇప్పుడు శీతాకాల కరోనా సమస్యలను అరికట్టడానికి సామాజిక దూరాన్ని పాటించడంతో పాటుగా, మాస్క్ లను ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్క్ ల వాడకం కోసం పలు రాష్ట్రాలలో కఠిన నిబంధనలను విధిస్తున్నారు. అయితే యూఎస్ లో మాస్కులు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది. యూఎస్ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ తరచుగా మాస్కులు లేకుండా కనిపించడంతో ప్రతిపక్ష పార్టీలకు అది ప్రధాన ఆయుధంగా మారింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications