క్రిస్మస్ వేళ.. కళ తప్పిన బెత్లెహెం.
నేడు క్రిస్మస్ సందర్భంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవులంతా ఎంతో భక్తి శ్రద్దలతో యేసును స్మరించుకోవాల్సిన రోజు ఇది. సహజంగానే జీసస్ జన్మస్థలమయిన బెత్లెహెం ఎప్పుడు పర్యాటకుల సందడితో కోలాహాలంగా ఉంటుంది. కానీ, క్రిస్మస్ వేళ మాత్రం బెత్లెహెం కళ తప్పింది. క్రిస్మస్ రోజు యాత్రికులతో సందడిగా ఉండే యేసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహెం ఈ సంవత్సరం మాత్రం బోసిపోయింది.
యుద్ధం కారణంగా ఇక్కడ ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అక్టోబరు 7న సరిహద్దు ప్రాంతాల్లోని హమాస్ ముష్కరుల మారణకాండకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడికి దిగిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఇక్కడ రెండు నెలలగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా భయానికి గురైన స్థానికులు ఇక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలను మూసివేశారు. ఈ యుద్ధం కారణంగా యాత్రికుల రాక పూర్తిగా నిలిచపోయిందని స్థానికులు చెబుతున్నారు.

క్రిస్మస్ సందర్భంగా కనీసం క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోలేని పరిస్థితులో ఇప్పడు ఇక్కడివారు ఉన్నారని ఇక్కడి హోటల్ యాజమాని ఒకరు తమ బాధను వెల్లబుచ్చారు. నాలుగు తరాల నుంచి ఇక్కడ హోటల్‌ను నడుపుతున్నా ఎప్పడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. ప్రతి రోజూ రాత్రికి కనీసం 120 మంది యాత్రికులు ఇక్కడ డిన్నర్ చేసేవారని, కానీ ఇప్పుడు యుద్ధం వల్ల హోటల్‌ని పూర్తిగా మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఓ హోటల్ యజమాని బాధపడుతున్నాడు.
ఇక్కడి వార్షిక ఆదాయంలో 70 శాతం వాటా పర్యాటక రంగం నుంచే..
బెత్లెహెమ్‌లో క్రిస్మస్ వేడుకలను అర్మేనియన్, కాథలిక్ ఆర్థోడాక్స్‌లు కలిసి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి వార్షిక ఆదాయంలో 70 శాతం వాటా పర్యాటక రంగం నుంచే సమకూరుతుందంటే ఇక్కడి పర్యాటకరంగం వల్ల ఎంత లాభం ఉందో మనకు అర్థమవుతుంది. కానీ, ఈ క్రిస్మస్‌కు మాత్రం బెత్లెహెమ్‌లోని వీధులన్నీ బోసిపోయాయి.
ఇక్కడి ప్రధాన విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతో బెత్లెహెమ్‌లోని 70 హోటళ్లు మూసివేయాల్సి వచ్చింది. పర్యాటక రంగంలోని దాదాపు 6వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. జెరూసలేంలో చాలా వరకూ దుకాణాలు, హోటళ్లు మూసి ఉన్నాయి. వాటిని తెరిచేందుకు యజమానులు భయపడుతున్నారు. ఒక వేళ తెరిచినా వ్యాపారం పెద్దగా ఉండదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications