వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బ... ఈ సంస్థలో ఉద్యోగం వస్తే... జాక్ పాట్ కొట్టేసినట్లే!

న్యూజిలాండ్ లోని ఓ క్రేజీ స్టార్టప్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఏడాదిలో ఎన్ని సెలవులైనా తీసుకోవచ్చు.. ఇష్టమొచ్చినప్పుడు పనిచేసుకోవచ్చు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: ఏ సంస్థలో అయినా ఉద్యోగులు అడిగినన్ని సెలవులు.. అందులోనూ అన్నీ పెయిడ్ లీవులు.. పైగా సంస్థ లాభాల్లో భాగం... అసలెవరైనా ఇస్తారా? ఓ క్రేజీ స్టార్టప్ కంపెనీ మాత్రం ఇచ్చేస్తోంది. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఏడాదిలో ఎన్ని సెలవులైనా తీసుకోవచ్చు.

న్యూజిలాండ్ లోని డునెడిన్ పట్టణంలో ఉన్న ఈ కంపెనీ పేరు 'రాకెట్ వర్కర్జ్'. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న వీడియోగేమ్ రూపకర్త డీన్ హాల్ దీని యజమాని. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భిన్నమైన పని వాతావరణం కల్పించాలని భావించిన డీన్.. పని వేళలు, సెలవుల నిబంధనలను పూర్తిగా మార్చాలని నిర్ణయించాడు.

No fixed timings, share in profit: Working in this New Zealand startup is bliss

'ఉద్యోగులు ఎన్ని లీవులైనా తీసుకోవచ్చు. జీతంలో ఎలాంటి కోత విధించం. సంస్థ లాభాల్లో భాగం కూడా ఇస్తాం. వాళ్లకు ఇష్టమొచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు.. వెళ్లొచ్చు. తమతోపాటు పెంపెడు పిల్లి కూనలను కూడా ఆఫీసుకు తీసుకొచ్చుకుని సరదాగా ఆడుకుంటూ పని ఒత్తడిని దూరం చేసుకోవచ్చు..' అని ప్రకటించాడు.

''ఉద్యోగులు వారికి అవసరమైనప్పుడు సెలవులు దొరక్కపోతే ఆఫీసుకు వచ్చినా సరిగా పని చేయలేరు. వారు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా చూడాలి. ఇన్ని గంటలు పని చేయాల్సిందే అనే నిబంధనలు కూడా అక్కర్లేదు. వాళ్లకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పడు పని చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అలా అయితేనే వాళ్లు తమ వ్యక్తిగత జీవితాన్ని.. చేసే ఉద్యోగాన్ని ఆనందించగలుగుతారు..'' ఇదీ డీన్ హాల్ మనోగతం.

అందుకే ఆ కంపెనీ ఉద్యోగులంతా ఇప్పడు వారి యజమానిని 'బాసూ.. నువ్వు సూపర్..' అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

English summary
A gaming company in New Zealand is luring employees from around the world by offering unlimited paid annual leave, a share in the company’s profits and no set work hours. Dean Hall's gaming studio Rocketwerkz having flexible work culture - which includes unlimited leave, a share in the company’s profits and Hall’s salary capped at 10% above his highest-paid employee -- is now drawing talent from around the globe, with Hall receiving 300 Facebook messages of inquiry since a local newspaper wrote about his unorthodox office last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X