పా'పి'స్తాన్: కుల్‌భూషణ్‌కు మళ్లీ కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేమన్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాక్ జైలులో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో మరోసారి పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలకు పోయింది. ఇప్పటికే ఒకసారి కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చిన పాకిస్తాన్, ఇక రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇచ్చేది లేదంటే తెగేసి చెప్పేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ ఓ ప్రకటన చేశారు.
అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని తీర్పునివ్వడంతో సెప్టెంబర్ 2వ తేదీన తొలిసారిగా కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ కలిశారు. అంతకుముందు నిబంధనలు షరతులపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగడంతో కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడంలో జాప్యం జరిగింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాల్సిందే అని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్‌ను ఆదేశించడంతో పాక్ అవకాశం కల్పించింది. అయితే ఎన్నిసార్లు ఇవ్వాలి అనేదానిపై న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేయలేదు.

ఇక సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్తాన్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిశారు. అక్కడి ఓ సబ్ జైలులో ఉన్న జాదవ్‌తో దాదాపు గంట సేపు సమావేశం అయ్యారు. అయితే తను మాట్లాడుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులు ఉండరాదని భారత్ పాక్‌ను కోరింది. అయినప్పటికీ భారత్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన పాకిస్తాన్.. గౌరవ్ అహ్లువాలియా మాట్లాడుతున్న సమయంలో తమ సిబ్బంది అక్కడే ఉండేలా జాగ్రత్త పడింది. ఇక పాక్ అధికారులు ఉండటమే కాదు.. కుల్‌భూషణ్, అహ్లువాలియాల మధ్య జరిగిన మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు.
Dr Mohammad Faisal, Spokesperson, Ministry of Foreign Affairs, Pakistan: There would be no second consular access to Kulbhushan Jadhav. (file pic) pic.twitter.com/zthz4Zewfh
— ANI (@ANI) September 12, 2019
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications