Nihon Hidankyo: జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి: ఎందుకంటే?

Nobel Peace Prize 2024: ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వచ్చేసింది. అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేస్తున్నజపాన్‌కు చెందిన సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్​‌కు చెందిన నిహోన్ హిడంక్యోకు ఈ ఏడాది శాంతి బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

నిహాన్‌ హిడాంక్యో సంస్థ త‌మ అనుభ‌వంతో ప్రజల్లో ఆశ‌, శాంతిని పెంపొదిస్తున్నట్లు క‌మిటీ కొనియాడింది. అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి హిరోషిమా, నాగసాకి అణుదాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో హిడాంక్యో సంస్థ ఏర్పడింది. నోబెల్‌ శాంతి అవార్డుతో హిరోషిమా, నాగ‌సాకి అణుబాంబు బాధితుల‌ను గౌర‌విస్తున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Nobel Peace Prize 2024 to Japan s Nihon Hidankyo

'హిరోషిమా, నాగసాకి అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు శారీరక సమస్యలు, విషాద జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. వారిని గౌరవించాలని భావిస్తున్నాం. శాంతి, విశ్వాసం పెంపొందించేందుకు వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించాం' అని నోబెల్ కమిటీ పేర్కొంది.

జపాన్ నగరాల్లో అణ్వాయుధాల బారిన పడిన బాధితుల ఉద్యమాన్ని హిబాకుషాగా పేర్కొంటారు. దీనిలో జపాన్ కు చెందిన 47 రాష్ట్రాల్లో పోరాడుతున్న ప్రతినిధులు ఉన్నారు.ఇక, వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కార ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయనశాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే ప్రకటించారు. గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతను ప్రకటించగా.. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నోబెల్ బహుమతి గురించిన వివరాల్లోకి వెళితే.. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+