Nobel Prize 2022 in Economics: బ్యాంకుల పతనాన్ని నివారించడంపై రీసెర్చ్..!!
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనల పరంపర కొనసాగుతోంది. ఆర్థికం, వైద్యం, సాహిత్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం అందించే ఈ అవార్డులను సోమవారం నుంచి ప్రకటిస్తూ వస్తోంది కమిటీ. వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు నోబెల్ బహుమతిని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 10, 2022
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrize pic.twitter.com/cW0sLFh2sj
ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, ప్రపంచశాంతికి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. మెడిసిన్‌లో స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొ, ఫిజిక్స్‌లో అలెన్ ఆస్పెక్ట్స్, జాన్ ఎఫ్.క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌కు జాయింట్‌గా నోబెల్ అవార్డ్‌ను ప్రకటించారు. కెమిస్ట్రీలోనూ ముగ్గురికి ఈ అవార్డ్ అందనుంది. కరోలిన్ ఆర్ బెర్టోజ్జి, మోర్టెన్ మెల్డల్, కే బ్యార్రీ షార్ప్‌లెస్ సంయుక్తంగా ఈ పురస్కరాన్ని అందుకోనున్నారు. సాహిత్యంలో ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాదికి నోబెల్ అవార్డ్ లభించింది.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలయాట్‌స్కీతో పాటు ఉక్రేనియన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంయుక్తంగా ప్రకటించింది. ఇవ్వాళ- ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు విజేతల వివరాలను వెల్లడించింది కమిటీ. బెన్ ఎస్ బెర్నాంకె, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ డైబ్విగ్ పేర్లను ప్రకటించింది. ఆర్థిక సంక్షోభాలు ఏర్పడిన సమయంలో బ్యాంకులు ఎలాంటి పాత్రను పోషించాల్సి ఉంటుందనే విషయం మీద ఈ ముగ్గురూ పరిశోధనలు చేశారు.
This year’s laureates in economic sciences, Ben Bernanke, Douglas Diamond and Philip Dybvig, have significantly improved our understanding of the role of banks in the economy, particularly during financial crises, as well as how to regulate financial markets. #NobelPrize pic.twitter.com/5Z2ra3iHAd
— The Nobel Prize (@NobelPrize) October 10, 2022
2006 నుంచి 2014 వరకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు బెర్నాంకె. ప్రస్తుతం వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో డగ్లస్ డైమండ్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. డైబ్విగ్ సెయింట్ లూయిసలోని వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఓలిన్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తోన్నారు. ఆర్థిక వ్యవస్థలో- ప్రత్యేకించి ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై ఈ ముగ్గురు చేసిన పరిశోధనలు అత్యుత్తమమైనవని కమిటీ అభిప్రాయపడింది.
బ్యాంకుల పతనాలను నివారించడానికి ఈ రీసెర్చ్ ఎంతో అవసరమౌతుందని స్పష్టం చేసింది. 2008-09 మధ్యకాలంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ అందించిన సేవలను తమ రీసెర్చ్‌లో పొందుపరిచినట్లు తెలిపింది. 1930లో ఏర్పడిన మాంద్యంపై బెర్నాంకే రూపొందించిన విశ్లేషణలు బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పర్చటానికి ఉపయోగపడతాయని వివరించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications