భూ తాపాన్ని నియంత్రించేలా: ఫిజిక్స్‌లో అద్భుత ఆవిష్కరణ: ముగ్గురికి నోబెల్

స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు రెండో రోజుకు చేరుకున్నాయి. స్పర్శకు సంబంధించిన నూతన ఆవిష్కరణలను కనుగొన్న అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ప్రకటించింది కమిటీ. రెండో రోజు భౌతిక శాస్త్రం వంతు. ఫిజిక్స్‌ గతిని మార్చే విధంగా కొత్త ఆవిష్కరణలను కనుగొన్న ముగ్గురు సైంటిస్టుల పేర్లను కమిటీ ఎంపిక చేసింది.

ఈ సంవత్సరం భౌతిక శాస్త్రానికి కు సంబంధించిన నోబెల్ అవార్డుల కోసం స్యుకురో మనబే, క్లాజ్ హ్యాసిల్‌మ్యాన్, జార్జియో పరిసిలను ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ వేర్వేరు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. స్యుకురో మనబే స్వదేశం జపాన్. క్లాజ్ హ్యాసిల్‌మ్యాన్‌ది జర్మనీ. కాగా జార్జ్ పరిసి ఇటలీకి చెందిన సైంటిస్ట్. ఈ ముగ్గురు ఫిజిక్స్‌లో నూతన ఆవిష్కరణలను కనుగొన్నారు. స్యుకురో మనబే.. హ్యాసిల్‌మ్యాన్- భూ వాతావరణం, భూ తాపానికి సంబంధించిన విషయాలను ముందుగానే అంచనా వేసేలా కొత్త ఆవిష్కరణలను గుర్తించారు.

Nobel Prize for Physics has been awarded to scientists from Japan, Germany and Italy

భూ వాతావరణం మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలపై ఆరా తీయడానికి అవసరమైన పునాదులను వేశారని నోబెల్ ప్యానెల్ కమిటీ ప్రశంసించింది. కార్బన్ డయాక్సైడ్ భూతాపం పెరగడానికి ఎలా కారణమౌతోందనే విషయంపై స్యుకురో మనబే 1960 నుంచి పరిశోధనలు సాగిస్తున్నారని కమిటీ పేర్కొంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి అవకాశం లభించిందని అభిప్రాయపడింది.

భూ వాతావరణం, భూతాపం, కార్బన్ డయాక్సైడ్ ప్రభావం మానవాళిని ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాన్ని హ్యాసిల్‌మ్యాన్ తన ప్రయోగాల ద్వారా శాస్త్రీయబద్ధంగా నిరూపించారని తెలిపింది. బయాలజీ, న్యూరోసైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్స్‌ను మరింత లోతుగా పరిశోధనలను సాగించడానికి వీలుగా ఫిజికల్ అండ్ మ్యాథమేటికల్ మోడల్స్‌ను జార్జియో పరిసి అభివృద్ధి చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గోరాన్ హాన్‌సెన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+