వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nobel Prize 2022 in Chemistry: ఆ సైంటిస్ట్‌కు రెండోసారి నోబెల్ అవార్డ్

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర సోమవారం ఆరంభమైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు నోబెల్ బహుమతిని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇప్పటికే మెడిసిన్‌, ఫిజిక్స్‌కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. అలెన్ ఆస్పెక్ట్స్, జాన్ ఎఫ్.క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌కు జాయింట్‌గా నోబెల్ అవార్డ్‌ను ప్రకటించారు. క్వాంటమ్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త శకానికి నాంది పలికినందుకు వారికి ఈ అవార్డ్ లభించింది.

Nobel Prize in Chemistry 2022: Awarded to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless

ఇవ్వాళ- కెమిస్ట్రీకి సంబంధించిన అవార్డ్‌ను ప్రకటించారు నోబెల్ కమిటీ సభ్యులు. కరోలిన్ ఆర్ బెర్టోజ్జి, మోర్టెన్ మెల్డల్, కే బ్యార్రీ షార్ప్‌లెస్‌కు సంయుక్తంగా ఈ పురస్కరాన్ని అందజేయనున్నట్లు ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ తెలిపారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి పేర్లను ప్రకటించారు.

క్లిక్ కెమిస్ట్రీ అండ్ బయోఆర్థొగానల్ కెమిస్ట్రీలో సరికొత్త ఆవిష్కరణలు చేసినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందజేయనున్నట్లు చెప్పారు. పరమాణు నిర్మాణానికి సంబంధించిన బ్లాక్స్ అతివేగంగా, విజయవంతంగా ఒకదానికొకటి మిళితం అయ్యేలా క్లిక్ కెమిస్ట్రీని బ్యారీ షార్ప్‌లెస్ ఆవిష్కరించారు. దీనివల్ల కెమిస్ట్రీలో ఫంక్షనల్ ఫార్మేషన్ అనేది ఇక మరింత వేగవంతమౌతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రెటరీ జనరల్ చెప్పారు.

81 సంవత్సరాల బ్యారీ షార్ప్‌లెస్‌.. కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతోండటం ఇది రెండోసారి. ఇదివరకు ఆయన 2001లో ఇదే సెగ్మెంట్‌లో నోబెల్ అవార్డ్‌ను అందుకున్నారు. అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో 1941లో జన్మించారు. డార్ట్‌మౌత్ కాలేజ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శటీలో చదువుకున్నారు. అమెరికే చెందిన మహిళా శాస్త్రవేత్త కరోలిన్ బెర్టోజీ. హార్వర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. మోర్టెన్ మెల్డల్ డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్త.

English summary
Nobel Prize in Chemistry jointly awarded to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry. కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X