వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలాలా యూసుఫ్‌జాయ్ నిఖా: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జనరల్ మేనేజర్‌తో వివాహం

|
Google Oneindia TeluguNews

లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ విద్యా సామాజిక ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్ ఒకింటి వారయ్యారు. ఆమె నిఖా చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయ పద్ధతుల్లో అసర్ మాలిక్‌ను నిఖా చేసుకున్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. వధూవరులు ఇద్దరూ ఈ నిఖా తమకు సమ్మతమేంటూ చెప్పారు. ఒకింటి వారయ్యారు. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆమె తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌పై పోస్ట్ చేశారు.

నిరాడంబరంగా నిఖా

నిరాడంబరంగా నిఖా

పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను యాడ్ చేశారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా మలాలా అభివర్ణించారు. అసర్ మాలిక్‌ను నిఖా చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఇకపై జీవితంలో తామిద్దరం కలిసి ప్రయాణించబోతున్నామని, ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా ఈ శుభ కార్యక్రమం పూర్తయింది.

2012లో దాడి..

2012లో దాడి..

మలాలా యూసుఫ్‌జాయ్ స్వదేశం పాకిస్తాన్. 2012లో ఆమె తాలిబాన్ల దాడికి గురయ్యారు. అప్పుడు ఆమె వయస్సు 15 సంవత్సరాలు. కరడుగట్టిన మత ఛాందసవాదులగా పేరున్న తాలిబన్లు మహిళా విద్యకు వ్యతిరేకం. మహిళలు చదువుకోవడాన్ని వారు సమర్థించరు. అందుకే వారు ఆమెపై అప్పట్లో దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిపారు. పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సులో ప్రయాణిస్తోన్న మలాలా యూసుఫ్‌జాయ్‌పై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు తాలిబన్లు.

బర్మింగ్‌హామ్‌లో స్థిరనివాసం..

బర్మింగ్‌హామ్‌లో స్థిరనివాసం..

తాలిబన్ మిలిటెంట్లు స్కూల్ బస్సులోకి ఎక్కి కాల్పులు జరిపినప్పుడు మలాలా అందులో ఉన్నారు. ఆ దాడిలో మలాలాతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడి గెలిచారు. ఆ తరువాత ఆమె కుటుంబం బర్మింగ్‌హామ్‌కు వెళ్లి స్థిరపడింది. సుదీర్ఘకాలం పాటు ఆమె వైద్య చికిత్సను పొందాల్సి వచ్చింది. బర్మింగ్‌హామ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. బర్మింగ్‌హామ్‌ నివాసంలోనే నిఖా చేసుకున్నారు.

2014లో నోబెల్ బహుమతి..

పాకిస్తాన్‌లో తాలిబన్ల దాడికి గురైన అనంతరం వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో చాలాకాలం పాటు ఆశ్రయం పొందారు మలాలా. 2014లో మలాలాకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. 17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు మలాలా చరిత్ర సృష్టించారు. ఆ తరువాత ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

అస్సర్ మాలిక్ ఎవరు..?

అస్సర్ మాలిక్ ఎవరు..?

మానవ హక్కుల ఉద్యమకారిణిగా మారారు. అఫ్ఘనిస్తాన్ శరణార్థులకు అండగా నిలిచారు. వారి కోసం పోరాడుతున్నారు. వారు ఎదుర్కొంటోన్న కష్టాలపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించారు. కాగా- అస్సర్ మాలిక్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అస్సర్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ ఆపరేషనల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్లేయర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీని నడిపిస్తున్నారు.

Recommended Video

TOP NEWS : Bird Flu Detected In Scores Of Dead Crows Centre Issues Alert To States Over Fatal Spread
2019 నుంచీ పరిచయం..

2019 నుంచీ పరిచయం..

లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ సెషలైజేషన్‌తో డిగ్రీ చదివారు అస్సర్ మాలిక్. 2019లో మలాలా యూసుఫ్‌జాయ్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇకక పరిచయం, స్నేహ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు యూసుఫ్ మలాలాజాయ్. ఈ వివాహం ఇద్దరికీ సమ్మతమేనని తెలియజేస్తూ.. ఒకింటివారయ్యారు.

English summary
Nobel Prize laureate and education activist Malala Yousafzai has announced her marriage on Twitter. The 24-year-old Pakistani human rights campaigner posted images on Twitter of her celebration on Tuesday with Asser Malik and her family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X