వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిజిక్స్‌లో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్

గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్‌లకు ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్‌లకు ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి వచ్చింది.

ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను వీరిని నోబెల్‌ పురస్కారం 2017 వరించింది. వీరు ముగ్గురు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది.

 Nobel prize in physics awarded for discovery of gravitational waves

దీంతో 1901 నుంచి ఫిజిక్స్‌ విభాగంలో నోబెల్‌ అందుకున్న 204 మంది జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్‌ అసెంబ్లీ వెల్లడించింది.

ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్‌ వేస్‌ మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్‌ థోర్న్‌, బ్యారీ బ్యారిష్‌ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అధ్యాపకులు.

English summary
Three American physicists have won the Nobel prize in physics for the discovery of gravitational waves, ripples in the fabric of spacetime that were first anticipated by Albert Einstein a century ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X