భారత్‌తో సహ పొరుగుదేశాలతో సత్సంబంధాలు: పాక్ ఆర్మీ చీప్ సూచన
ఇస్లామాబాద్: ఇండియాతో పాకిస్తాన్ మంచి సంబంధాలను కోరుకోవాలని భావిస్తోందని పాక్ రక్షణ అధికారుల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా కోరారు.
భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్లమెంట్ సెనెట్ కమిటీని కోరారు.ఇరుగు పొరుగు దేశాలతో పాక్ మంచి సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు పాక్‌లో అస్థిరతను పెంచేందుకు ఇండియా సైన్యం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించడం గమనార్హం. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశం ముందు ఆర్మీ చీఫ్ ఖమర్ జానేద్ బజ్వా హజరయ్యారు.
రాజకీయ నేతలు తీసుకొనే నిర్ణయాలను సైన్యం అనుసరిస్తోందని సెనెట్ కమిటీ ఆయన చెప్పారు. భారత్ తో పాటు అన్ని పొరుగుదేశాలతో సత్సంబంధాలు పాక్ కు ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.












Click it and Unblock the Notifications