వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ఆస్తులపై అమెరికా కన్ను: ఉ.కొరియాపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు

ఉత్తరకొరియా బుద్దిచెప్పేందుకు అమెరికా అన్నిరకాల అస్త్రాలను సిద్దం చేస్తోంది. ఉత్తర కొరియాను చక్రబంధంలోకి నెట్టేందుకు అమెరికా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ఉన్‌కు ఆస

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా బుద్దిచెప్పేందుకు అమెరికా అన్నిరకాల అస్త్రాలను సిద్దం చేస్తోంది. ఉత్తర కొరియాను చక్రబంధంలోకి నెట్టేందుకు అమెరికా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ఉన్‌కు ఆస్తులన్నింటిని స్థంభింపజేయాలని అమెరికా ప్రతిపాదించింది.

ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ఉన్‌ ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. అణుపరీక్షలు, క్షిపణులను ప్రయోగిస్తూ అమెరికా మిత్రదేశాలకు తన సత్తా చూపుతున్నారు.

అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!

ఉత్తరకొరియాపై ఇప్పటికిప్పుడే సైనిక చర్యకు దిగబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను కట్టడి చేయాలని మాత్రం అమెరికా భావిస్తోంది.

సద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహంసద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహం

కిమ్ ఆస్తుల స్థంభింపజేయాలని అమెరికా ప్లాన్

కిమ్ ఆస్తుల స్థంభింపజేయాలని అమెరికా ప్లాన్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ , కొరియా ప్రభుత్వ ఆస్తులను స్థంబింపజేయాలని అమెరికా ప్రతిపాదించింది. ఉత్తరకొరియా అధికారుల విదేశీ పర్యటనలను కూడ నిషేధించాలని కూడ అమెరికా ప్రతిపాదిస్తోంది. ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలను అమలు చేయడం ద్వారా దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.

బొగ్గు ఎగుమతుల నిషేధం

బొగ్గు ఎగుమతుల నిషేధం

ఉత్తరకొరియా నుండి బొగ్గు గనుల ఎగుమతులను ఐక్యరాజ్యసమితి నిషేధించింది. దేశ ఎగుమతుల్లో మూడోవంతు వాటాను బొగ్గు ఎగుమతులదే. బొగ్గు ఎగుమతులను నిషేధించడంతో కొరియాకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వస్త్ర పరిశ్రమ ఎగుమతులపై ఆంక్షలు

వస్త్ర పరిశ్రమ ఎగుమతులపై ఆంక్షలు

కొరియా వస్త్ర ఎగుమతులను నిషేధించాలని కూడ అమెరికా భావిస్తోంది. కొరియా కార్మికులు విదేశాల్లో పనిచేయకుండా నిషేధించాలని అమెరికా భావిస్తోంది. దుస్తుల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికుల ఆధాయం వల్లే విదేశీ ద్రవ్యాన్ని కొరియా ఆర్జించగలుగుతోంది.

అమెరకా ఆంక్షలపై రష్యా,చైనా సహకరిస్తాయా?

అమెరకా ఆంక్షలపై రష్యా,చైనా సహకరిస్తాయా?

ఉత్తరకొరియాపై అమెరికా విధించదల్చుకొన్న అమెరికా ఆంక్షలపై చైనా, రష్యాలు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి. కొరియాపై ఆంక్షలను విధించడం ద్వారా దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

English summary
The US has proposed a range of new United Nations sanctions against North Korea, including an oil ban and a freeze on leader Kim Jong-un's assets.The draft resolution circulated to the Security Council members comes after North Korea's sixth nuclear test and repeated missile launches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X