వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు సమీపంలో అమెరికా యుద్ద విమానాలు, యుద్దమే

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా, అమెరికాల మధ్య చోటుచేసుకొంటున్న మాటల యుద్దం ఇక చేతల వరకు చేరుకొంది. ఏ క్షణమైనా యుద్దం వచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి.ఉత్తరకొరియాకు సమీపంలోనే అమెరికా తన యుద్ద విమానాలను మోహరించింది.

'కిమ్‌ కోసం సెక్స్ బానిసలు, ఎదురు తిరిగితే ఉరే''కిమ్‌ కోసం సెక్స్ బానిసలు, ఎదురు తిరిగితే ఉరే'

ఉత్తరకొరియా, అమెరికాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచదేశాలకు తన అణ్వాయుధాల సత్తాను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చూపిస్తున్నారు. అయితే ఉత్తరకొరియా దూకుడును అరికట్టేందుకు అమెరికా వ్యూహలు రచిస్తోంది.

'ఆ దేశాల వల్లే 3వ, పప్రంచ యుద్దం', 'ట్రంప్ వల్లే రెచ్చిపోతున్న కిమ్''ఆ దేశాల వల్లే 3వ, పప్రంచ యుద్దం', 'ట్రంప్ వల్లే రెచ్చిపోతున్న కిమ్'

ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా చుక్కలు చూపిస్తోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్దమయ్యారు.

ట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలుట్రంప్‌కు షాక్: చైనాకు షాకిస్తున్న కిమ్, మళ్ళీ అణుపరీక్షలు

ఈ రెండు దేశాధినేతల మధ్య మాటల యుద్దమే సాగుతోంది.అయితే మాటలే కాదు చేతల్లో కూడ ఉత్తరకొరియాపై ఆదిపత్యం సాధించేందుకు అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. ఏ క్షణంలోనైనా తాము యుద్దానికి సిద్దంగా ఉన్నామనే సంకేతాలను అమెరికా ఇస్తోంది.

ఉత్తరకొరియాకు సమీపంలో అమెరికా యుద్ద విమానాలు

ఉత్తరకొరియాకు సమీపంలో అమెరికా యుద్ద విమానాలు

ఉత్తరకొరియా శనివారం నాడు అణుపరీక్షలు నిర్వహించింది. ప్రపంచ దేశాలను ఉత్తరకొరియా తన అణ్వస్త్ర పరీక్షలతో భయబ్రాంతులకు గురిచేస్తోంది.ఈ తరుణంలో అమెరికా రంగంలోకి దిగింది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షల తరువాత స్వల్ప భూకంపం నమోదైంది. మరో వారం వ్యవధిలో ఇంకో అణు పరీక్షకు ఆ దేశం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా తీరంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ బీ-1బీ లాన్సర్ బాంబర్లు, ఫైటర్ జెట్ విమానాలను మోహరించింది.

యుద్దానికి సిద్దమనే సంకేతాలు

యుద్దానికి సిద్దమనే సంకేతాలు

ఏ క్షణంలో యుద్దం వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలను అమెరికా ఇచ్చింది.ఉత్తరకొరియాపై దాడికి తన సైనిక సంపత్తిని అమెరికా ఉత్తరకొరియాకు దగ్గరగా చేరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా యుద్ద విమానాలు అంతర్జాతీయ జలాలపై విన్యాసాలు చేస్తున్నాయి.

ఉ.కొరియాకు అమెరికా సత్తా చూపుతాం

ఉ.కొరియాకు అమెరికా సత్తా చూపుతాం

ఉ.కొరియాకు అమెరికా సత్తాను చూపుతామని అమెరికా ప్రకటించింది. అమెరికా ముందు సైనిక చర్యలు సహా చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఉత్తర కొరియా ప్రభుత్వానికి వెల్లడించే ఉద్దేశంతోనే విమానాలను మోహరించి విన్యాసాలు జరుపుతున్నామని పెంటగాన్ ప్రతినిధి డనా వైట్ వెల్లడించారు. ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూ, సమస్య తీవ్రతను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇక యుద్దమేనా?

ఇక యుద్దమేనా?


వారం రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ట్రంప్ రెచ్చిపోగా, అంతే స్థాయిలో ఉత్తర కొరియా బదులిచ్చింది. ఇరు దేశాధి నేతలూ ఒకరిని ఒకరు కుక్కలతో పోల్చుకున్నారన్న సంగతీ తెలిసిందే. ఆపై రెండు రోజుల వ్యవధిలోనే మరో అణు పరీక్షకు దిగడం, దాని తీవ్రతకు భూకంపం రావడంతో అమెరికా తీవ్రంగా భావిస్తోంది. ఉత్తర కొరియా అణు పరీక్షలను నిశితంగా గమనిస్తున్నామని సీటీబీటీఓ (కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్) పేర్కొనడం గమనార్హం. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాకు సమీపంలోనే అమెరికా తన బలగాలను మోహరించింది. యుద్దానికి సిద్దంగా అమెరికా ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు అనుమానిస్తున్నారు.

English summary
US bombers have flown close to North Korea's east coast to demonstrate the military options available to defeat any threat, the Pentagon has said.It said the flight was the farthest north of the demilitarised zone between the Koreas that any US fighter jet or bomber had flown in the 21st Century.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X