వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షిపణి పరీక్షలతో దేశాలను వణికిస్తున్న కిమ్, 5 ఏళ్ళలో 78 క్షిపణి పరీక్షలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ పేరు వింటేనే జపాన్ గుండెల్లో వణుకు పుడుతోంది. తాజాగా ఉత్తరకొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అచ్చం గల్ప్ యుద్ద సమయంలోని స్కడ్ మిసైల్ తరహలోనిదే.

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్ యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ పేరు వింటేనే జపాన్ గుండెల్లో వణుకు పుడుతోంది. తాజాగా ఉత్తరకొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అచ్చం గల్ప్ యుద్ద సమయంలోని స్కడ్ మిసైల్ తరహలోనిదే.

ఈ క్షిపణి ఏకంగా 450 కి.మీ. దూరంలో వెళ్ళి సరిగ్గా జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలలిలో ల్యాండ్ అయింది.అంటే తాము ఏ క్షణంలోనైనా జపాన్ పై దాడి చేయడానికి సిద్దంగా ఉన్నామని ఒక రకంగా కిమ్ హెచ్చరించినట్టే సంకేతాలు ఇచ్చినట్టు కన్పించింది.

గడిచిన మూడు వారాల్లో ఉత్తరకొరియా ఇలా క్షిపణి పరీక్షలు చేయడం ఇది మూడోసారి. తమ ఆయుధ సామర్థ్యం ఇదీ అని కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ సారి ప్రయోగించిన ఖండాంతర క్షిపణి మాత్రం తమ విమానాలు,నౌకల భద్రతకు పెనుముప్పు కల్గిస్తోందని జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి మోషిహెడే సుగా వ్యాఖ్యానించారు.

North Korea launches missile towards Japan in NINTH test this year

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన తీర్మాణాలను అది స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఆయన చెప్పాడు.
ఉత్తరకొరియాను అణచివేసేందకు తాము అమెరికాతో కలిసిపనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబె చెప్పారు.

ఇటలీలో జీ- 7 దేశాల సమావేశం నుండి తిరిగివస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా క్షిపణి పరీక్షగురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడ సమాచారం వెళ్ళింది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించారు.

ఉత్తరకొరియా తూర్పుతీరంలోని వాన్సాన్ నగర సమీపంలో గల ఒక వైమానిక క్షేత్రం నుండి దీన్ని ప్రయోగించారు. ఆరునిమిషాల్లో అది జపాన్ సమీపంలోని సముద్రంలో లక్ష్యాన్ని చేరిందని, అప్పటివరకు దాన్ని ట్రాక్ చేశారని పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియా తాజా పరీక్షలతో దక్షిణ కొరియా కూడ అప్రమత్తమైంది.అన్ని విధాలుగా సిద్దంగా ఉండాల్సిందిగా సైనిక దళాల జాయింట్ చీఫ్ లకు కొత్త అధ్యక్షుడు మూన్ జే ఇన్ తెలిపారు.

అవసరమైతే తాము అమెరికా ప్రధాన భూభాగం మీద కూడ అణుదాడి చేయగలమని గతంలో ఉత్తరకొరియా హెచ్చరించింది. అయితే అమెరికా కంటే దక్షిణకొరియా మీదే కిమ్ దృష్టిపెట్టాడు. దక్షిణకొరియాజనాభాలో సగంవరకు సియోల్ ప్రాంతంలోనే ఉంది. అదంతా ఉత్తరకొరియా అర్టిలరీ ఫైరింగ్ రేంజ్ లో ఉంది. దీంతో సంప్రదాయ ఆయుధాలతోనే దక్షిణకొరియామీద విరుచుకుపడే సామర్థ్యం కిమ్ సైన్యానికి ఉంటుంది. తాము చేపట్టిన ఐదున్నరేళ్ళలో కిమ్ జోంగ్ ఏకంగా 78 క్షిపణులను పరీక్షించాు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 17 ఏళ్ళలో కేవలం 16 క్షిపణలు పరీక్షించాడు. కిమ్ ప్రయోగించిన 78 క్షిపణుల్లో ఇప్పటికీ 61 విజయవంతమయ్యాయి.

English summary
after a series of test-launches of missiles in recent weeks.Japan has strongly condemned the missile launch which flew about 450 km before landing in the Japanese exclusive economic zone, within the Sea of Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X