వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధునిక నియంత కిమ్‌జొంగ్ కనుసన్నల్లో - బైడెన్ వార్నింగ్ తరువాత మరింత తీవ్రం..!!

|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తర కొరియా అధినేత, ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన కిమ్‌జొంగ్ ఉన్.. వెనక్కి తగ్గట్లేదు. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలనూ పట్టించుకోవట్లేదు. తాను అనుకున్నది చేస్తోన్నారు. దుందుడుకు వైఖరిని కొనసాగిస్తోన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ దాని సరిదిద్దుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టూ కనిపించట్లేదాయన. దేశ ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటోన్నారు.

బెంబేలెత్తిస్తోన్న కిమ్..

బెంబేలెత్తిస్తోన్న కిమ్..


అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేస్తోన్నారు. దీనిపై అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. లెక్కచేయట్లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్‌ను బెంబేలెత్తిస్తోన్నారు కిమ్‌జొంగ్. దక్షిణ కొరియా, జపాన్ సముద్ర జలాల్లోకి తరచూ బాల్లిస్టిక్ మిస్సైళ్లను సంధిస్తోన్నారు. అత్యంత శక్తిమంతమైన క్షిపణులు అవి. కిందటి నెల 25వ తేదీ నుంచి ఆదివారం వరకు ఏడు బాల్లిస్టిక్ క్షిపణులను ఆయా దేశాల సముద్ర జల్లాల్లోకి సంధించింది ఉత్తర కొరియా.

అమెరికా సహకారంతో..

అమెరికా సహకారంతో..


కిమ్‌జొంగ్ దూకుడును అడ్డుకోవడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఇటీవలే దక్షిణకొరియాతో కలిసి ఉమ్మడిగా క్షిపణి పరీక్షలను చేపట్టింది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణులను కొరియన్ సముద్ర జలాల్లోకి సంధించింది. సైనిక విన్యాసాలనూ నిర్వహించింది. అత్యంత శక్తిమంతమైన ఎంజీఎం-140 ఆర్మీ టెక్నికల్ మిస్సైల్ సిస్టమ్‌ను వినియోగించింది. ఎఫ్-15కే ఫైటర్ జెట్లతో- ఆకాశం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను సైతం సంధించింది.

స్వయంగా బరిలో..

స్వయంగా బరిలో..

ఈ మిలటరీ డ్రిల్స్ కూడా కిమ్‌జొంగ్ పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ సైనిక విన్యాసాల తరువాత.. తన క్షిపణి పరీక్షలను మరింత తీవ్రతరం చేశారు. తానే స్వయంగా బరిలో దిగారు. క్షిపణి పరీక్షలను దగ్గరుండి నిర్వహించారు. వాటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆదివారం నిర్వహించిన రెండు బాల్లిస్టిక్ క్షిపణి పరీక్షలు కిమ్‌జొంగ్ కనుసన్నల్లో పూర్తయ్యాయని, ఆయన స్వయంగా వాటిని చేపట్టారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

 తిరుగులేని దేశంగా..

తిరుగులేని దేశంగా..

కిందటి నెలలో ఉత్తర కొరియా తన అణు చట్టాలను సవరించుకుంది. అణ్వాయుధ సంపత్తిలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించేలా చట్టాలను పునఃసమీక్షించుకుంది. ఈ సెగ్మెంట్‌లో తిరుగులేని అణుశక్తిగా ఉత్తర కొరియా ఆవిర్భవించనున్నట్లు ప్రకటించుకుంది. దీని తరువాత క్షిపణి పరీక్షలు మరింత ముమ్మరం అయినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సైనిక విన్యాసాల్లో 150 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను వినియోగించినట్లు కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది.

వ్యతిరేక కూటమికి హెచ్చరికగా..

వ్యతిరేక కూటమికి హెచ్చరికగా..

తన ఆయుధ సంపత్తిని చాటి చెప్పేలా కిమ్‌జొంగ్ తాజాగా యుద్ధ విన్యాసాలను నిర్వహించారని, తనకు వ్యతిరేకంగా అమెరికా-జపాన్, దక్షిణకొరియా ఎలాంటి కూటమి కట్టినా ఉపయోగం ఉండబోదనే ఉద్దేశాన్ని ఆయన హెచ్చరించదలచుకున్నారని రాండ్ కార్పొరేషన్ అనలిస్ట్ సూ కిమ్ చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయన తన దేశాన్ని తీర్చిదిద్దినట్లు కనిపిస్తోందని చెప్పారు.

English summary
The United States and South Korea launched four missiles off the east coast of the Korean Peninsula on Wednesday morning local time, according to South Korea’s Joint Chiefs of Staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X