వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...

ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు లోకానికి పెద్దగా తెలియవు. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేసే కిమ్‌ లగ్జరీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

కిమ్ రాజభోగాలు తెలిస్తే షాకే ! కిమ్ ని లొంగదీయాలంటే అదే మార్గం | Oneindia Telugu

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు లోకానికి పెద్దగా తెలియవు. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేసే కిమ్‌, ఆయన భార్య రీ సోల్ జూల లగ్జరీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

కిమ్ జాంగ్ ఉన్ అసలేం చదువుకున్నారు? ఆయన ఆసక్తుల గురించి కూడా ఎవరికీ తెలియదు. ఓ స్విస్‌ స్కూల్‌లో కిమ్‌ విద్యను అభ్యసించారని చెబుతుంటారు. కిమ్ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీకోసం...

కిమ్ వ్యక్తిగత విశేషాలు...

కిమ్ వ్యక్తిగత విశేషాలు...

కిమ్‌ జాంగ్ ఉన్ కుటుంబానికి ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్‌ కూడా ఉంది. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు ఉండే పడవ కిమ్‌ సొంతం. సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్‌ ఉంది. 100కు పైగా కార్లు రోజూ కిమ్‌ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి దాడి జరిగినా ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా కిమ్‌ కోసం ప్రత్యేకంగా మెర్సిడెజ్‌ కారును తయారు చేయించారు.

కళ్లు తిరిగే వసతులు..

కళ్లు తిరిగే వసతులు..

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఓ ప్రత్యేక విమానం ఉంది. దానిపేరు ‘ఎయిర్ ఫోర్స్ వన్'. అలాగే ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కు కూడా ఒక ప్రత్యేక విమానం ఉంది. దానిపేరేమిటో తెలుసా? ‘ఎయిర్ ఫోర్స్ ఉన్'. ఈ విమానం లోపల ఉండే వసతుల చూస్తే కళ్లు తిరగాల్సిందే. లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్‌ పడి చచ్చిపోతారట. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్‌ వద్ద ఉన్నాయి. ఇంకా కిమ్‌ పియానోలను ఇష్టపడతారట. కిమ్‌ తన కలెక్షన్‌లో మూడు డజన్లకు పైగా పియానోలను ఉంచుకున్నారు. ఇక మందు విషయానికొస్తే.. ఆయనకు లోకల్‌ మందంటే గిట్టదట. ఫారెన్‌ సరుకు లేకపోతే ఉండలేరని వినికిడి.

ప్రతీ దేశం నాశనం!

ప్రతీ దేశం నాశనం!

ఉత్తర కొరియా ఒకవేళ అణుయుద్ధానికి గనుక సిద్ధమైతే.. ఆ ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుందట. అప్పుడు ఆసియా దేశాలన్నీ తమ అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణుడు హెన్రీ ఆర్‌ కిస్సింగర్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆసియా దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని ఈ అమెరికా మాజీ రక్షణ అధికారి చెబుతున్నారు.

అన్నీ శక్తిమంతమైనవే...

అన్నీ శక్తిమంతమైనవే...

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గత తొమ్మిది నెలల్లో ఏకంగా 15 అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణుల్లో కొన్ని జపాన్ మీదుగా ప్రయాణించాయి. సెప్టెంబరులో నిర్వహించిన అణు పరీక్షతో చైనా సరిహద్దు వెంబడి భూమి కంపించింది. దక్షిణ కొరియా సరిహద్దులో కూడా ప్రకంపనలు వచ్చాయి. వాటి ప్రభావాన్ని బట్టి అవి బాగా శక్తివంతమైనవని అర్థమవుతోంది. అంతేకాదు, కిమ్ వద్ద నేరుగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరాన్ని చేరుకునే క్షిపణి కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అన్ని దేశాలకూ ప్రమాదమే...

అన్ని దేశాలకూ ప్రమాదమే...

మరోవైపు అమెరికా న్యూస్ ఏజెన్సీ ఏబీసీ కూడా కిమ్‌ క్షిపణి పరీక్షలపై పరిశీలకుల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించింది. దీనికి సమాధానంగా కొన్ని న్యూస్ ఏజెన్సీలు కూడా మరికొన్ని పరిశోధనలు చేసి కొన్ని విషయాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా వద్ద నున్న పలు రకాల క్షిపణులు ప్రతీ దేశంలోని ఏదో ఒక మూలను తాకే సామర్థ్యం కలిగి ఉన్నాయనేది నిపుణుల అంచనా. ఆ లెక్కన్న కిమ్ పరీక్షిస్తున్న క్షిపణులు అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను సైతం నేరుగా చేరుకోగలవనేది నిజమేనని ఆ నివేదికల సారాంశం.

అతి ప్రమాదకరమైన క్షిపణులు...

అతి ప్రమాదకరమైన క్షిపణులు...

ఉత్తరకొరియా వద్ద ఉన్న స్కడ్ క్షిపణికి జపాన్‌లోని ఒసాకాను, దక్షిణా కొరియాను తాకే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. అలాగే ఆ దేశం వద్ద ఉన్న మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ క్షిపణుల పరిధిలోకి టోక్యోతోపాటు జపాన్‌లోని ఇతర నగరాలు, ఈశాన్య చైనా, తూర్పు మంగోలియా, ఆగ్నేయ రష్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు అయితే చైనాలోని చాలా నగరాలను ధ్వంసం చేయగలవట. అలాగే తూర్పు రష్యా, ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, ఫిలిప్పైన్స్, అమెరికాలోని గువామ్‌లను చేరుకునే శక్తి కూడా కొన్ని క్షిపణులకు ఉందట. ఇక కీలకమైనవి, అతి ప్రమాదకరమైనవి ఖండాంతర క్షిపణులు. చాలా వరకు మధ్య ప్రాచ్య దేశాలు, ఈశాన్య ఇటలీ, స్కాట్లాండ్, పశ్చిమ ఇంగ్లండ్, ఈశాన్య ఈజిప్ట్, పశ్చిమ సోమాలియా, అలస్కా, అమెరికా, కెనడా, ఇండియా, తూర్పు యూరోప్, టర్కీ, గ్రీస్, స్కాండినేవియా, ఆస్ట్రేలియాలో చాలా వరకు నగరాలను ఈ రకం క్షిపణులు ధ్వంసం చేయగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కిమ్ ని లొంగదీయాలంటే...

కిమ్ ని లొంగదీయాలంటే...

తమ దగ్గర మాత్రమే అణు ఆయుధాలు ఉన్నాయని ఉత్తర కొరియా విర్రవీగుతోంది. కానీ, వాటి స్థాయిలో కాకపోయినా పొరుగున ఉన్న మరికొన్ని దేశాలు కూడా శక్తివంతమైన క్షిపణులనే కలిగి ఉన్నాయి. అణుయుద్ధమే గనుక మొదలైతే.. ఈ దేశాలన్నీ ఏకతాటిపైకి రావడం ద్వారా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ మెడలు వంచవచ్చు అని హెన్రీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో హెన్రీ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

English summary
As North Korea continues to build up its nuclear arsenal speculation is growing over how crackpot North Korean dictator Kim Jong-un funds his lavish lifestyle of superyachts, party islands and luxury limos. Kim, whose regime has again shocked the world by carrying out hydrogen bomb tests, continues to live in the lap of luxury while most of his people struggle to survive on scraps. And as the international community imposes increasingly harsh sanctions on the hermit state, questions about his seemingly endless funds are being raised. North Korea has been accused of funding Kim’s extravagant lifestyle through illegal operations such as cybercrime, weapons trading, dealing drugs and trafficking endangered species.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X