ట్రంప్‌కు షాక్: దక్షిణ కొరియాతో చర్చలకు సిద్దం, ఒలంపిక్‌కు ప్రతినిధులు: కిమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: అమెరికాతో పాటు దాని మిత్రదేశాలకు చుక్కలు చూపిస్తున్న ఉత్తరకొరియా నుండి తొలిసారిగా దక్షిణ కొరియాతా చర్చలకు సిద్దమని ప్రకటించింది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ దక్షిణ కొరియాతో తాము చర్చలకు సిద్దమని స్పష్టం చేశారు. కిమ్ ప్రకటనతో రెండు దేశాల మధ్య మంచి సంప్రదాయాలు నెలకొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

  China looks at North Korea with frustration ఉ. కొరియా అంటే హడలెత్తిపోతున్న చైనా | Oneindia Telugu

  కిమ్‌కు షాక్: ఉత్తరకొరియాపై యుద్దానికి అమెరికా రెఢీ: మైక్ ముల్లెన్ సంచలనం

  ఉత్తరకొరియా ఇటీవల కాలంలో అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతోంది. నూతన సంవత్పరాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా అధ్యక్షుడు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

  ట్రంప్‌కు కిమ్ షాక్: 'భయపెట్టినంత కాలం అణు కార్యక్రమాలు చేస్తాం'

  అణు శక్తి సామర్థ్యాలను పెంచుకొంటామని కిమ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా తమను బ్లాక్ మెయిల్ చేసినంత కాలం అణుశక్తి సామర్థ్యాలను పెంచుకొంటూనే ఉంటామని కిమ్ ఇదివరకే ప్రకటించారు.

  దక్షిణ కొరియాతో చర్చలకు సిద్దం

  దక్షిణ కొరియాతో చర్చలకు సిద్దం

  అమెరికా దాని మిత్రదేశాలకు ఉత్తరకొరియా అధ్య క్షుడు కిమ్ జంగ్ ఉన్ తన సత్తాను చూపుతున్నాడు. అయితే అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న దక్షిణ కొరియాకు కిమ్ జంగ్ స్నేహ హస్తాన్ని చాటారు. దక్షిణ కొరియా అమెరికాతో సన్నిహితంగా ఉంటుంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా అమెరికాతో చేతులు కలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు బహిరంగ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉ.కొరియా.. ద.కొరియాను ఆహ్వానించింది..

  దక్షిణ కొరియాలో ఒలంపిక్స్‌కు ఉత్తరకొరియా ప్రతినిధులు

  దక్షిణ కొరియాలో ఒలంపిక్స్‌కు ఉత్తరకొరియా ప్రతినిధులు

  ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు బహిరంగ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉ.కొరియా.. ద.కొరియాను ఆహ్వానించింది. ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య శాంతిపూర్వక వాతావరణం ఏర్పడేలా చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అందుకు ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలన్నారు. ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌కు ఉత్తరకొరియా నుంచి ప్రత్యేకంగా డెలిగేట్లను పంపిస్తామని కిమ్‌ తెలిపారు.

  స్వాగతించిన దక్షిణ కొరియా

  స్వాగతించిన దక్షిణ కొరియా

  ఉత్తరకొరియా ఆహ్వనాన్ని దక్షిణ కొరియా స్వాగతించింది. శాంతి పూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ద.కొరియా ప్రకటించింది. ఏ సమయంలోనైనా తాము ఆ దేశంతో చర్చించేందుకు సుముఖంగా ఉన్నామని ద.కొరియా ప్రకటించింది. రెండు దేశాలు కూడ తమ మధ్య శాంతి నెలకొనాలని కోరుకోవడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఇరు దేశాల అధికారుల చర్చలు

  ఇరు దేశాల అధికారుల చర్చలు

  రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు దేశాల అధికారులు త్వరలోనే సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత త్వరగా ఇరు దేశాల అధికారులు కలిసి కూర్చొని చర్చలు జరుపుతామని కొరియన్‌ పెనిన్సులా ప్రకటించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kim Jong Un warned the United States on Monday he had a “nuclear button” on his desk ready for use if North Korea was threatened, but offered an olive branch to South Korea, saying he was “open to dialogue” with Seoul.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి