వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్సైల్ టెస్టులో కిమ్‌కు గాయాలు.. ట్విస్ట్ ఇచ్చిన ఉత్తర కొరియా.. తొలిసారి అధికారిక ప్రకటన..

|
Google Oneindia TeluguNews

సప్తసముద్రాలు ఈదినోడు, చివరికి పిల్లకాలువలో పడి చనిపోయినట్లు.. మహా ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులతో ఆటలాడుకున్న నియంత నేత, చివరికి ఓ సాధారణ మిస్సైల్ పరీక్షలో ఘోరంగా దెబ్బతిన్నాడన్న వార్త కలకలం రేపుతున్నది. కొద్దిరోజులుగా జాడలేకుండా పోయిన ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జాగ్ ఉన్ చనిపోయి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నవేళ ఆదేశ అధికారిక మీడియా ఎట్టకేలకు ఓ ప్రకటన చేసింది.

 ఏప్రిల్ 14న ఘటన..

ఏప్రిల్ 14న ఘటన..

36ఏళ్ల కిమ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రహస్య ప్రాంతానికి తరలించి, కార్డియోవాస్క్యులర్‌ శస్త్రచికిత్స చేశారని, అది ఫెయిల్ కావడంతో ఆయన బ్రెయిన్‌డెడ్‌ బారిన పడ్డారని తొలుత వార్తలు వచ్చాయి. సౌత్ కొరియా, చైనా ప్రభుత్వాలు మొదట్లో ఈ వార్తల్ని ఖండించినా, ఆది, సోమవారాల్లో కొన్ని సోర్సులు ఏకంగా కిమ్ మరణవార్తను ధృవీకరించాయి. కానీ అది నిజం కాదని కిమ్ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుతం అమెరికాలో శరణార్థిగా ఉన్న డాక్టర్ లీ జియాంగ్ హో తెలిపారు.

మిస్సైల్ లాంచర్ కూలి..

మిస్సైల్ లాంచర్ కూలి..

నార్త్ కొరియా తూర్పు తీరంలో ఏప్రిల్ 14న ఒక మిస్సైల్ టెస్ట్ జరిగిందని, ఆ ప్రక్రియలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుందని, లాంచర్ విరిగిపడటంతో మిస్సైల్ భూమిని ఢీకొట్టిందని జియాంగ్ చెప్పారు. ఆ ప్రయోగంలో కిమ్ స్వయంగా పాల్గొని ఉండొచ్చని, శకలాలు ఎగిరిపడటంతో ఆయన తీవ్రంగా గాయపడి ఉండొచ్చని అన్నారు. రహస్య ప్రాంతంలో కిమ్ కు ఆపరేషన్ జరిగిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కిమ్ ఆరోగ్యాన్ని చూసుకునే డాక్టర్లందరూ రాజధాని ప్యోంగ్యాంగ్ లోనే ఉంటారని ఆయన తెలిపారు. ఈలోపే..

బతికే ఉన్నారంటూ..

బతికే ఉన్నారంటూ..

చివరిసారిగా ఏప్రిల్ 11న బయట కనిపించిన కిమ్ ఆ తర్వాత పత్తాలేకుండా పోవడంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. ఇన్నాళ్లూ మౌనం వహించిన ఉత్తరకొరియా అధికారిక మీడియా తొలిసారిగా సోమవారం ఒక ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది. సౌతాఫ్రికా స్వాతంత్ర్య దినోత్సవం(ఏప్రిల్ 27) సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసాకు శుభాకాంక్షలు తెలుపుతూ కిమ్ రాసిన లేఖను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) ప్రచురించింది. తద్వారా కిమ్ బతికే ఉన్నారని పరోక్షంగా ప్రపంచానికి తెలియజేసింది. అయితే..

Recommended Video

Kim Jong Un is Alive and Well Confirms South Korea
వీడని అనుమానాలు..

వీడని అనుమానాలు..

చీటికీ మాటికీ కిమ్ జాంగ్ ఫొటోలు, వీడియోలు ప్రసారం చేసే కేసీఎన్ఏలో గత 15 రోజులుగా ఆ దృశ్యాలు కనిపించకపోవడం అనుమానాలను ఊతమిచ్చినట్లయింది. సౌతాఫ్రికాకు శుభాకాంక్షల లేఖ తప్ప కిమ్ ఫొటోను ఆయన దేశ మీడియా ప్రచురించలేదు. అమెరికా, కొరియా, చైనాకుతోడు జపాన్ మీడియా సైతం కిమ్ చనిపోయారనే ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తూనే ఉన్నాయి..

English summary
North Korean media publishes letter from Kim Jong Un to South Africa's President dated April 27. Former Workers' Party official Lee Jeong Ho claims Kim must have been hurt during missile tests on April 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X