వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ క్షణమైనా అణుయుద్ధం! అమెరికా భూభాగం మొత్తం.. ఉత్తరకొరియా ఫైరింగ్ రేంజ్ లో!? టెన్షన్.. టెన్షన్

అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ.. ఐక్యరాజ్య సమితి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ.. ఐక్యరాజ్య సమితి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు.

అమ్మో.. కిమ్! కొంప ముంచేలాగే ఉన్నాడు, క్షిపణుల తరలింపును పసిగట్టిన అమెరికా శాటిలైట్లు!అమ్మో.. కిమ్! కొంప ముంచేలాగే ఉన్నాడు, క్షిపణుల తరలింపును పసిగట్టిన అమెరికా శాటిలైట్లు!

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాజాగా మాట్లాడుతూ.. తమ దేశ క్షిపణి కార్యక్రమాలు వ్యూహాత్మకంగా చేపడుతున్నవని, వాటిని నిలిపివేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికాను వణికిస్తోన్న కార్చిచ్చు, బూడిదైన వేల ఇళ్లు, స్మశానాన్ని తలపిస్తున్న నివాస ప్రాంతాలుఅమెరికాను వణికిస్తోన్న కార్చిచ్చు, బూడిదైన వేల ఇళ్లు, స్మశానాన్ని తలపిస్తున్న నివాస ప్రాంతాలు

 ముప్పు తొలగిపోయే వరకూ...

ముప్పు తొలగిపోయే వరకూ...

ఉత్తర కొరియా అణు సంపత్తిని, అది చేపడుతున్న క్షిపణి ప్రయోగాలను ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ సమర్థించుకున్నారు. 1970 నుంచీ ఉత్తరకొరియా.. అమెరికాకు టార్గెట్ గా మారిందని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తరువాత ఈ ముప్పు మరింత అధికమైందన్నారు. మాటలతో రెచ్చగొట్టడం ట్రంప్ కు అలవాటుగా మారిందని కిమ్ దుయ్యబట్టారు. అమెరికా నుంచి అణుముప్పు పూర్తిగా తొలిగేపోయేవరకూ తమ దేశం అణ్వాయుధాలు, బాలిస్టిక్ రాకెట్ల తయారీని నిలిపివేయదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అది మా హక్కు...

అది మా హక్కు...

అణు పరీక్షలు తాము ఏటా నిర్వహించే మిలిటరీ ఎక్సర్ సైజ్ లలో భాగమేనని ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ముప్పు ఏర్పడిన నేపథ్యంలోనే తమ దేశం ఆయుధాలు తయారు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఆత్మరక్షణ కోసం అణ్వాయుధాలు కలిగి ఉండడం తమ హక్కు అని, వాటిని తయారు చేయరాదంటూ ఒత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదని ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిటీకి ఆయన తేల్చి చెప్పారు. ఉత్తరకొరియా చేపట్టిన అణుకార్యక్రమాన్ని ఆపివేయించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితిచే ఆంక్షలు కూడా విధింపజేశారు. మిత్ర దేశమైన చైనా కూడా ఉత్తరకొరియాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది.

అమెరికా చర్యలే కారణమా?

అమెరికా చర్యలే కారణమా?

ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ చేసిన తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ల ‘పిల్లీ ఎలుక ఆట'ను చూసి నవ్వుకుంటున్న పలు దేశాలు ఈ తాజా ప్రకటనతో నివ్వెరపోయాయి. ఉన్నట్లుండి ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ ఈ స్థాయిలో హెచ్చరిక చేయడానికి కారణమేమిటో ఆయన మాటల్లోనే బోధపడింది. తమ దేశ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఆయన ఓ సీక్రెట్ మిషన్ ఏర్పాటు చేశారంటూ ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ మండిపడ్డారు.

మా భూభాగంలో ఓ అంగుళంపై దండెత్తినా...

మా భూభాగంలో ఓ అంగుళంపై దండెత్తినా...

ఎవరి మాటా లెక్కచేయకుండా.. వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడి, అంతలోనే హైడ్రోజన్ బాంబును పరీక్షించామంటూ ప్రకటించి ప్రపంచ దేశాలను అయోమయంలో పడేసిన ఉత్తరకొరియా.. ఆ మధ్యన అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై నేరుగా క్షిపణి దాడి చేస్తామంటూ హడలెత్తించిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియా ప్రకటనతో నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఉత్తరకొరియాకు అంత సత్తా ఉందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు ఉత్తరకొరియా కొంప ముంచేలాగే ఉందని భయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ భయాందోళనను ఇంకాస్త పెంచారు ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్. అమెరికా భూభాగం మొత్తం తమ ఫైరింగ్ రేంజ్ లో ఉందంటూ ఆయన తాజాగా బాంబు పేల్చారు. అంతేకాదు, ట్రంప్.. ఉత్తరకొరియా భూభాగంలో ఓ అంగుళంపై దండెత్తే దుస్సాహసానికి పాల్పడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అమెరికా మిత్రదేశాలకూ అల్టిమేటం...

అమెరికా మిత్రదేశాలకూ అల్టిమేటం...

ఏ క్షణంలోనైనా అణుయుద్ధం రావచ్చంటూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాజాగా హెచ్చరిక చేసిన ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ అమెరికాకే కాకుండా దానికి మద్దతు పలికే బ్రిటన్, జపాన్ వంటి ఇతర దేశాలకు కూడా అల్టిమేటం ఇచ్చారు. ఉత్తరకొరియాతో అమెరికాకు యుద్ధం వస్తే.. అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొనేందుకు ఇటీవల బ్రిటన్.. క్వీన్ ఎలిజబెత్ అనే యుద్ధనౌకను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఒకవేళ యుద్ధమంటూ వస్తే.. అమెరికాతో మిత్రదేశాలు కలవకపోవడమే శ్రేయస్కరమని, గొప్పలకుపోయి లేనిపోని ముప్పు తెచ్చుకోవద్దని ఆయన జపాన్, బ్రిటన్ లను ఉద్దేశించి హితవు పలికారు. అవసరమైతే ఇతర దేశాలపైనా అణుబాంబు వేసేందుకు తమ దేశం ఏమాత్రం వెనకాడదని, అలాంటి పరిస్థితి రాదనే తాము భావిస్తున్నామని కిమ్ ఇన్ ర్యాంగ్ పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలోని అమెరికన్లకు సూచన...

దక్షిణ కొరియాలోని అమెరికన్లకు సూచన...

ఐక్యరాజ్య సమితిలో ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ తాజా హెచ్చరికతో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తరకొరియా యుద్ధమంటూ మొదలెడితే తక్షణ ముప్పు పక్కనే ఉన్న దక్షిణ కొరియాకే. ఆ విషయం తెలిసిన అమెరికా దక్షిణ కొరియాలోని తన పౌరులను హెచ్చరించింది. తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, దక్షిణ కొరియాను వీడి వెనక్కి రావడం చాలా మంచిదని సూచించింది.

చర్చలకు ఇంకా ఛాన్స్ ఉంది...

చర్చలకు ఇంకా ఛాన్స్ ఉంది...

ఉత్తరకొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ తాజా హెచ్చరికలపై అమెరికా స్టేట్ సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ స్పందించారు. సాధ్యమైనంత వరకు ఉత్తరకొరియాతో యుద్ధం చేయకూడదనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘రెక్స్ టిల్లర్సన్ .. ఉత్తరకొరియా ఇష్యూలో మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు.. మీ సత్తాని దాచుకోండి..'' అంటూ గతంలో ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తరువాత కూడా.. ‘‘ఉత్తరకొరియాతో వివాదం పరిష్కారానికి అన్ని దారులు మూసుకుపోయాయి.. ఇప్పుడిక ఒకే ఒక మార్గం మిగిలి ఉంది..'' అంటూ పరోక్షంగా యుద్ధం గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినా సరే, ఉత్తరకొరియాతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఆ దేశం మొదటి బాంబు వేసేంత వరకు వేచి చూస్తామని అమెరికా స్టేట్ సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు.

English summary
North Korea’s deputy UN ambassador has warned that the situation on the Korean peninsula “has reached the touch-and-go point and a nuclear war may break out any moment”. Kim In-ryong told the UN general assembly’s disarmament committee that North Korea is the only country in the world that has been subjected to “such an extreme and direct nuclear threat” from the United States since the 1970s and said the country has the right to possess nuclear weapons in self-defence. He pointed to large-scale military exercises every year using “nuclear assets” and said what is more dangerous is what he called a US plan to stage a “secret operation aimed at the removal of our supreme leadership”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X