ఈ ప్రయోగం ఫలిస్తే.. 'సునామీ' పట్ల నో ఫికర్..
సముద్రంలో పుట్టుకొచ్చే సునామీలు తీర ప్రాంతాలను తాకకముందే ధ్వని గురుత్వాకర్షణ(ఏజీడబ్ల్యూ) తరంగాల సహాయంతొ సునామీలను అదుపుచేయవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు.
లండన్: ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసే సాంకేతికత గనుక అందుబాటులోకి వస్తే.. కోట్ల ఆస్తి నష్టాలను, అంతకుమించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఇన్నాళ్లు అలాంటి సాంకేతిక ఏది అందుబాటులో లేదు గనుక ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతీసారి తీరని నష్టం జరుగుతూనే వస్తోంది.
పరిశోధకులు చేస్తోన్న పరిశోధనలు సత్ఫలితాలనిస్తుండటంతో త్వరలోనే ప్రకృతి విపత్తులకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రకృతి విపత్తుల్లో అత్యంత ప్రమాదకరమైన సునామీని నిలువరించేందుకు పరిశోధకులు ఓ కొత్త మార్గాన్ని అన్వేషించారు.

సముద్రంలో పుట్టుకొచ్చే సునామీలు తీర ప్రాంతాలను తాకకముందే ధ్వని గురుత్వాకర్షణ(ఏజీడబ్ల్యూ) తరంగాల సహాయంతొ సునామీలను అదుపుచేయవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. సముద్ర ఉపరితల నుంచి కొన్ని వేల మీటర్ల వరకు ప్రయాణించే ఏజీడబ్ల్యూ తరంగాల ద్వారా సునామీల తీవ్రతను, వ్యాప్తిని తగ్గించవచ్చునని భావిస్తున్నారు.
సునామీ వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలపై నిరంతరం ఈ ఏజీడబ్ల్యూ తరంగాలను ప్రయోగించడం ద్వారా సునామీని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చునని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications