రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్; అణుదాడులకు రంగం సిద్ధం చేస్తున్న పుతిన్!!
ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధంలో వేలసంఖ్యలో ప్రజలు, సైనికులు మరణించారు. ఉగ్రరూపంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరి మాటను లెక్క చెయ్యకుండా ముందుకు సాగుతున్నారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

రష్యా అణు ప్రయోగానికి సిద్ధమైందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరొక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా ఉక్రెయిన్ లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉక్రెయిన్ లొంగిపోవాలని పుతిన్ ఎంత హెచ్చరించినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతగా దాడి చేసినా ప్రతిదాడులకు దిగుతున్న ఉక్రెయిన్ తీరుతో రష్యా అణు ప్రయోగానికి సిద్ధమైనట్టు సమాచారం.

న్యూక్లియర్ డ్రిల్స్ చెయ్యటం కోసం రష్యా ఆదేశం
రష్యా న్యూక్లియర్ డ్రిల్స్ చేసేందుకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు రష్యా తీర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాలకు రష్యా సబ్ మెరైన్ లు చేరుకున్నట్లు తెలుస్తోంది. రష్యా చేపట్టే న్యూక్లియర్ డ్రిల్స్ లో పలు న్యూక్లియర్ సబ్ మెరైన్ లు పాల్గొంటున్నాయి. సైబీరియా నుంచి అడవిలో మొబైల్ లాంచర్ లను రష్యన్ ఆర్మీ ఇప్పటికే మోహరించింది. బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించేందుకు అవసరమైన లాంచర్ లను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని రష్యా నార్తెన్ ప్లీట్ అధికారికంగా ప్రకటించింది.

పుతిన్ ఇప్పటికే అణు ప్రయోగానికి సిద్ధమని ప్రకటించడం ఆందోళనకరం
ప్రపంచ దేశాల కఠినమైన ఆంక్షలను కూడా పట్టించుకోకుండా పుతిన్ ఇప్పటికే అణు ప్రయోగానికి సిద్ధమని ప్రకటించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో రష్యా లోని అణు ఆయుధ బలగాలను అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. న్యూక్లియర్ సబ్ మెరైన్ లతో వ్యూహాత్మక బాంబర్లలను రష్యా సిద్ధం చేసుకుంటుంది. ఇక ఈ పరిస్థితులలో రష్యా అణు ప్రయోగంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా ప్రపంచంలోనే రెండు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పుతిన్ ఆదేశాలతో రష్యా మరింత ఉద్రిక్తతలను పెంచుతోంది.

కీవ్ పై ఆధిపత్యం కోసం రష్యా వార్ ... ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్
ఇదిలా ఉంటే కీప్ సహా పలు ప్రధాన నగరాల్లో రష్యా ఉక్రెయిన్ సేనల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. కీవ్ నగరాన్ని ఆక్రమించేందుకు రష్యన్ సేనలు చొచ్చుకొస్తున్న క్రమంలో ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన నగరమైన ఖర్కీవ్ పై విరుచుకుపడ్డాయి. రాకెట్ దాడులతో, బాంబుల మోతతో ఖర్కీవ్ నగరం మార్మోగిపోతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications