అమెరికా హింసపై ఒబామా ఫైర్- ట్రంప్‌పై నిప్పులు- అగ్రరాజ్యం పరువు పోతోందంటూ..
అమెరికాలో అధికార మార్పిడి నేపథ్యంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక చర్యలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించారు. యూఎస్ కాంగ్రెస్‌పై దాడి, బహిరంగంగా జరుగుతున్న హింసాత్మక చర్యలపై ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లపై ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
నిన్న యూఎస్ కాంగ్రెస్‌పై జరిగిన దాడిపై ముందుగా స్పందించిన ఒబామా... ఇది అగ్రరాజ్యం పరువు తీసే చర్య అని, అవమానకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ట్రంప్ ప్రేరేపిత చర్యలుగా ఒబామా పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఆశ్చర్యకరమైన ఘటనగా మనం భావిస్తే అది చిన్నపిల్లలాటగా ఉంటుందన్నారు. చట్టబద్ధంగా జరిగిన ఎన్నికలపై ట్రంప్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒబామా మండిపడ్డారు. ట్రంప్ వైఖరి సమంజసంగా లేదన్నారు.

ట్రంప్ పార్టీ రిపబ్లికన్లపైనా ఒబామా నిశిత విమర్శలు చేశారు. రిపబ్లికన్లు కూడా తమ అభిమానులు, కార్యకర్తలకు వాస్తవాలు చెప్పడం లేదని ఒబామా ఆరోపించారు. దీని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న హింసాత్మక ఘటనలని ఒబామా అభిప్రాయపడ్డారు. దీనంతటికీ ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలే బాధ్యత వహించాలని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో మాజీ అధ్యక్షుడు ఒబామా సూచించారు.
ఇలాంటి చర్యల వల్ల అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న మన దేశం పరువు పోతోందన్నారు. దీంతో ఒబామా వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications