కన్నీరు పెట్టిన అమెరికా అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: దేశంలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతిపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టారు. మూడేళ్ల క్రితం కనెక్టికట్ 20మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను ముష్కరులు తుపాకీ గుళ్లకు బలి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన ఏడ్చేశారు. ఆ చిన్నారులు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ తాను పిచ్చివాడినై పోతున్నట్లు చెప్పారు.
చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెసును డిమాండ్ చేయాలని ఆయన మంగళవారం శ్వేతసౌధం కార్యక్రమంలో అన్నారు.

తుపాకుల అమ్మకాల కట్టడికీ కాంగ్రెసు వ్యతిరేకతను పట్టించుకోకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. గన్ లాబీ కాంగ్రెసును బందీగా చేసుకోగలదేమో గానీ అమెరికాను కాదని ఆయన అన్నారు.
తుపాకీ సంస్కృతిని అదుపు చేయలేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశాల్లో జరుగుతున్నటువంటి తుపాకీ హింస లేదని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications