కాశ్మీరీల గొంతకనవుతా: పాక్ ప్రధాని షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాశ్మీరీలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. కాశ్మీరీలకు తాను అండగా ఉంటానంటూ బహిరంగంగా చెప్పారు.
కాశ్మీరీలు వారి హక్కులను కోల్పోతున్నారని, ఇప్పుడు వారి గొంతుకను కావాల్సిన బాధ్యత పాక్ ప్రధానిగా తనపై ఉందని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గతంలో నవాజ్ షరీఫ్ ఆరోపించారు.

ఇదే విషయంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల హై కమిషనర్ కు లేఖలు రాశారు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ సమావేశానికి సమాయత్తమయ్యేందుకు పాక్ అధికారులతో నవాజ్ షరీఫ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంలో నవాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం కాదని చెప్పారు. కాశ్మీరీల స్వయం నిర్ణయం తీసుకునే హక్కును నిరాకరించడం ఐక్యరాజ్య సమితి వైఫల్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు. మొత్తం మీద నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు కాశ్మీరీలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మరో సారి వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications