వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron virus:ఆ పేరు ఎలా వచ్చింది.. జిన్ పింగ్‌తో పోలిక ఏంటీ..?

|
Google Oneindia TeluguNews

క‌రోనా ప్ర‌భావం త‌గ్గింది అని అనుకునేలోపే కొత్త రూపంలోకి మారి హ‌డ‌లెత్తిస్తోంది. ఆఫ్రిక‌న్ దేశాల్లో పుట్ట‌కొచ్చిన‌ కొత్త వేరియంట్ B.1.1.529 ప్ర‌పంచ దేశాల్ని భ‌య‌పెట్టిస్తోంది. కొత్త వేరియంట్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఇంత‌కీ ఈ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే పేరునే ఎందుకు పెట్టారు? దీనికి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌కు ఉన్న సంబంధ‌మేంటి?

 omicron covid variant did who skip two letters of greek alphabet

క‌రోనావైర‌స్ బ‌య‌ట‌ప‌డిన కొత్త‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొవిడ్‌-19 అని నామ‌క‌ర‌ణం చేసింది. ఆ త‌ర్వాత ఈ వైర‌స్ నుంచి ప‌లు ర‌కాల ఉత్ప‌రివ‌ర్త‌నాలు పుట్టుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వాటికి గ్రీకు అక్ష‌ర‌మాల ప్ర‌కారం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా.. అంటూ డ‌బ్ల్యూహెచ్‌వో పేర్లు పెట్టుకొచ్చింది. ఇందులో డెల్టా అత్యంత వినాశ‌నం సృష్టించింది. ఇప్పుడు మ‌రో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ముందు నుంచి అనుస‌రిస్తున్న గ్రీకు అక్ష‌రమాల ప్ర‌కారం డెల్టా త‌ర్వాత వేరియంట్‌కు న్యూఅని పెట్టాలి. ఒక‌వేళ న్యూ త‌ర్వ‌ాత కొత్త వేరియంట్ గ‌నుక వ‌స్తే అప్పుడు దానికి జి అని పెట్టాల్సి ఉంటుంది.

జి అంటే చైనా అధ్య‌క్షుడు జి జిన్‌పింగ్ పేరును ఇది ప్ర‌తిబింబించేలా ఉంది. మొద‌ట్నుంచి క‌రోనా వైర‌స్ చైనాలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పుట్టింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు చైనాపై ఒకింత ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో B.1.1.529 త‌ర్వాత వ‌చ్చే వేరియంట్‌కు చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ పేరుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న పేరు పెడితే ఇబ్బందులు వ‌స్తాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో భావించింది. అన‌వ‌స‌రంగా వివాదాలు సృష్టించ‌డం ఎందుక‌ని న్యూ, షి రెండు అక్ష‌రాల‌ను వ‌దిలేసి ఆ త‌ర్వాత వ‌చ్చే అక్ష‌రం ఒమిక్రాన్ పేరును కొత్త వేరియంట్‌కు పెట్టింది. హార్వ‌ర్డ్ మెడిక‌ల్ కాలేజీకి చెందిన మెడిసిన్ ప్రొఫెస‌ర్ మార్టిన్ కుల్డార్ఫ్ స‌రికొత్త వివ‌ర‌ణ ఇచ్చారు.

డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్‌ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఉత్ప‌రివ‌ర్త‌నం అని తెలియ‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. వేగంగా విస్త‌రిస్తున్న B.1.1.529 వేరియంట్ ప‌ట్ల ఇప్ప‌టికే పలు దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ద‌క్షిణాఫ్రికా నుంచి త‌మ దేశాల‌కు ఆంక్ష‌ల‌ను విధించాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించింది. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ పై విమ‌ర్శ‌లు రాకుండా ఉండేందుకు తెలివిగా ఆలోచించింది.

English summary
omicron covid variant did who skip two letters of greek alphabet to avoid xi for china president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X